భూముల రీ-సర్వే ప్రక్రియ చరిత్రలో లిఖించదగిన అధ్యాయం
ABN, First Publish Date - 2022-12-07T00:52:02+05:30
భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లతో చేపట్టిన భూముల రీసర్వే ప్రక్రియ చరిత్రలో లిఖించదగిన అధ్యాయం అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబా బు తెలిపారు.
కార్యక్రమంలో మాట్లాడుతున్న రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు
నరసరావుపేట రూరల్, డిసెంబరు 6 : భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లతో చేపట్టిన భూముల రీసర్వే ప్రక్రియ చరిత్రలో లిఖించదగిన అధ్యాయం అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబా బు తెలిపారు. పట్టణంలోని భువనచంద్ర టౌన హాలులో వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష పథకంలో భాగంగా మంగళవారం రైతులకు శాశ్వత భూహక్కు పత్రాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి రాంబాబు మాట్లాడుతూ జిల్లాలో చిత్తశుద్ధితో యంత్రాంగం ఒక టీంగా ఏర్పడి భూముల రీసర్వే ప్రక్రియ 80 గ్రామాలలో పూర్తి చేయడం శుభ పరిణామం అన్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ భూముల రీసర్వే ఆధారంగా గ్రామాలలో నెలకొన్న భూసమస్యల పరిష్కారంతో పాటు భవిష్యత్తు తరాల వా రికి ఎటువంటి భూసమస్యలు లేకుండా ఉంటాయన్నారు. వైసీపీ జిల్లా అధ్యక్షు డు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 363 గ్రామాలకు సంబంధించి 13 లక్షల ఎకరాల రైతులకు శాశ్వత భూహక్కు పత్రాలను అందించడం చాలా గొప్ప విషయం అన్నారు. కలెక్టర్ శివశంకర్ లోతేటి మాట్లాడుతూ జిల్లాలో 80 గ్రామాలలో రీ సర్వే పనులు చేపట్టాల్సి ఉండగా 70 గ్రామాల్లో 13 లక్షల ఎకరాలకు గానూ 4.5 లక్షల ఎకరాలు రీసర్వే ప్రక్రియ పూర్తి చేయడం జరి గిందన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నియోజక వర్గంలో అత్యధికంగా అగ్రహారం భూములు ఉన్నాయని, భూముల రీసర్వేతో అగ్రహారం రైతుల సమస్య పరిష్కారం కానుందన్నారు. గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నో ఏళ్ళగా రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలు భూసర్వే ద్వారా పరిష్కారం కానున్నాయన్నారు. పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకరరావు మాట్లాడుతూ భూ రీసర్వే ద్వారా గ్రామాల్లో రైతులు సమస్యలు సత్వర పరిష్కారం కావడంతో పాటుగా భవిష్యత్తు తరాలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో డీఆర్వో వినాయకం, ఆర్డీవో శేషిరెడ్డి, రాజకుమారి, అద్దయ్య, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచలు, ఎంపీటీసీ లు, మార్కెట్ యార్డు చైర్మనలు తదితరులు పాల్గొన్నారు. తొలుత డాక్టర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నాయకులు, అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Updated Date - 2022-12-07T00:52:07+05:30 IST