ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీసీలకు న్యాయం జరగాలంటే కులగణన అవసరం

ABN, First Publish Date - 2022-12-18T23:18:35+05:30

రాష్ట్రంలోని బీసీలకు సంపూర్ణ న్యాయం జరగాలంటే కులగణన అవసరమని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు కేసన శంకరరావు పేర్కొన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు శంకరరావు తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొల్లూరు, డిసెంబరు 18: రాష్ట్రంలోని బీసీలకు సంపూర్ణ న్యాయం జరగాలంటే కులగణన అవసరమని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు కేసన శంకరరావు పేర్కొన్నారు. ఆదివారం బీసీలను గ్రామస్థాయి నుండి బలోపేతం చేసేందుకు మండలస్థాయి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ నాయకులను కొల్లూరు నుండి చింతలంక వరకు భారీ ర్యాలీగా తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా వేమూరు నియోజకవర్గ అధ్యక్షుడు మురాల వాసుదేవ్‌ అధ్యక్షతన జరిగిన సభలో శంకరరావు మాట్లాడుతూ, కులజనగణన జరిగేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు బీసీలంతా కలిసికట్టుగా పోరాడాలన్నారు. నియోజకవర్గంలోని బీసీ యువజన అధ్యక్షుడు క్రాంతికుమార్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగమల్లేశ్వరరావు, ఉపాధ్యక్షులు ద్వారక శ్రీను, ఎన్టీఆర్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి మేక వెంకటేశ్వర్లు, యువజన అధ్యక్షుడు పోతార్లంక రాజేష్‌, వేమూరు మండల అధ్యక్షుడు తొలుసూరి సాయినిరంజన్‌ యాదవ్‌, గ్రామ సర్పంచ్‌ తోడేటి రత్నాకర్‌ పాల్గొన్నారు. అనంతరం కొల్లూరు మండల, గ్రామస్థాయి అధ్యక్షులు, ఉపాధ్యక్షులను నియమించి వారికి నియామకపత్రాలు అందించారు. కార్యక్రమంలో కోగంటి సాంబయ్య, గోపయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-18T23:18:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising