ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మానసిక ఒత్తిడితోనే కూతురు చనిపోయిందన్న తండ్రి.. తన వద్ద లేకున్నా గర్భం ఎలా వచ్చిందన్న అల్లుడు.. చివరకు డీఎన్‌ఏ రిపోర్టులో..

ABN, First Publish Date - 2022-12-16T19:58:32+05:30

మానసిక ఒత్తిడితోనే కూతురు చనిపోయిందన్న తండ్రి.. తన వద్ద లేకున్నా గర్భం ఎలా వచ్చిందన్న అల్లుడు.. చివరకు డీఎన్‌ఏ రిపోర్టులో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: అత్యాచారం కేసులో పోక్సో ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది. ముద్దాయికి యావజ్జీవ జైలు శిక్ష, రూ.2 వేలు జరిమానా విధించారు. నష్టపరిహారం కింద రూ.75 వేలు చొప్పున హతురాలి తల్లి, భర్తకు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని న్యాయమూర్తి ఆదేశించారు. గుంటూరు (Guntur) పట్టణంలోని సంపత్‌నగర్‌‌కు చెందిన నాగరాజుకు ఇద్దరు కుమార్తెలు. 2013లో పెద్ద కుమార్తెకు వివాహం చేశారు. 2016లో చిన్న కుమార్తెకు వివాహం చేశారు. అయితే అద్దె ఇంట్లో ఉండలేక భర్తతో కలిసి పుట్టింటికి వచ్చింది. చిన్న కుమార్తె ఒక్కతే ఇంట్లో ఉన్న సమయంలో ఆమెపై నాగరాజు అత్యాచారానికి పాల్పడ్డాడు. బయటికి చెపితే చంపేస్తానని బెదిరించి తరచూ అత్యాచారం చేసేవాడు. అనుమానంతో ప్రశ్నించిన భార్యను కూడా నాగరాజు బెదిరించాడు. ఓ రోజు ఆమె అస్వస్థతకు గురైంది.ఆమెను పరీక్షించిన వైద్యులు.. గర్భం దాల్చిందని చెప్పారు. దీంతో తన భాగోతం ఎక్కడ బయటపడుతుందోనని కుమార్తెను ఆత్మహత్యకు ప్రేరేపించాడు నాగరాజు. 2019 మార్చి 23న మానసిక క్షోభ భరించలేక ఆమె ఆత్మహత్య చేసుకుంది.

నాగరాజే ముందుగా లాలాపేట పోలీస్‌స్టేషన్‌ (Lalapeta Police Station)కు వెళ్లి తన కుమార్తె మానసిక వత్తిడికి గురయి ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదు చేశాడు. తొలుత ఆమె భర్తను పోలీసులు అనుమానించారు. అయితే భర్తను, అతడి బంధువులు నిర్దోషి అని గట్టిగా వాధించారు. కాపురం చేయకుండానే హతురాలికి గర్భం ఎలా వచ్చిందని ప్రశ్నించారు. పోస్టుమార్టం సమయంలో హతురాలి గర్భం నుంచి సేకరించిన పిండంను, ఆమె భర్త డీఎన్‌ఏ (DNA) తో పోల్చేందుకు టెస్ట్‌కు పంపారు. కేసు తనపైకి వస్తుందని గుర్తించిన నాగరాజు పరారయ్యాడు. పోలీసు దర్యాప్తులో నాగరాజే కుమార్తెను బెదిరించి, ఆమె గర్భవతి కావటంతో ఆత్మహత్య చేసుకునేందుకు ప్రోత్సహించాడని తేలింది. దీంతో అప్పటి ఈస్ట్‌ డివిజన్‌ డీఎస్పీ సుప్రజ కోర్టులో నాగరాజుపై చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. 2020 జనవరి 6న నాగరాజును పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కోర్టులో నాగరాజుపై నేరం రుజువుకావటంతో జీవితఖైదు, రూ.2వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.

Updated Date - 2022-12-16T19:58:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising