ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నోడల్‌ టీంలు సమర్థంగా పని చేయాలి

ABN, First Publish Date - 2022-01-22T05:04:27+05:30

జిల్లాలో కేసుల సంఖ్య పెరుగుతోన్న నేపథ్యంలో కొవిడ్‌ నివారణ, చికిత్సల పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన నోడల్‌ బృందాలు సమర్థంగా పని చేయాలని జేసీ రాజకుమారి ఆదేశించారు.

కరోనాపై సమీక్షిస్తున్న జేసీ రాజకుమారి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో   కేసుల సంఖ్య పెరుగుతోన్న నేపథ్యంలో కొవిడ్‌ నివారణ, చికిత్సల పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన నోడల్‌ బృందాలు సమర్థంగా పని చేయాలని జేసీ రాజకుమారి ఆదేశించారు. కొవిడ్‌-19 మూడో దశ వ్యాప్తి నివారణ, చికిత్సలపై నోడల్‌ అఽధికారులతో  శుక్రవారం డీఆర్‌సీ మీటింగ్‌ హాల్‌లో ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ట్రేసింగ్‌, శాంపిల్‌ టెస్టింగ్‌, ట్రైఏజ్‌, హోం ఐసోలేషన్‌, హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌ తదితర బృందాలు అవసరమైన సిబ్బందిని నియమించుకొని బలోపేతం కావాలన్నారు. అనుమానిత లక్షణాలు ఉన్న వారి శాంపిల్స్‌ సేకరించి 24 గంటల వ్యవధిలో టెస్టింగ్‌ ల్యాబ్‌కు పంపాలన్నారు. హోం ఐసోలేషన్‌ నోడల్‌ టీంలోని సిబ్బంది నిత్యం బాధితుల ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని వారికి అవసరమైన వైద్య సలహాలు అందించాలన్నారు. సమావేశంలో పులిచింతల ప్రాజెక్టు స్పెషల్‌ కలెక్టర్‌ వినాయకం, డీఎంహెచ్‌వో డాక్టర్‌ జొన్నలగడ్డ యాస్మిన్‌, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రభావతి పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-22T05:04:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising