ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Janasena protest: బిపి మండల్ విగ్రహ దిమ్మె తొలగింపుపై జనసేన ఆందోళన

ABN, First Publish Date - 2022-09-30T16:50:10+05:30

బిపి మండల్ విగ్రహ ఏర్పాటు దిమ్మెను తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జిల్లాలో ఇన్నర్ రింగు రోడ్డు కూడలి వద్ద శుక్రవారం జనసేన ఆందోళనకు దిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: బిపి మండల్ విగ్రహ (BP Mandal statue) ఏర్పాటు దిమ్మెను తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జిల్లాలోని ఇన్నర్ రింగు రోడ్డు కూడలి వద్ద శుక్రవారం జనసేన (Janasena) ఆందోళనకు దిగింది. ఈ సందర్భంగా జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ (bonaboina srinivas yadav) మాట్లాడుతూ... బీసీల ఎదుగుదలకు మూల కారకులైన బిపి మండల్ విగ్రహానికి అనుమతి ఇవ్వకపోవడం దారుణమన్నారు. బీసీలంతా కలిసి మండల్ విగ్రహ ఏర్పాటు కోసం ముందుకు వచ్చారని తెలిపారు. కానీ ఈ విగ్రహ దిమ్మెను అధికారులు తొలగించడం దారుణమన్నారు. విగ్రహ శంకుస్థాపన రోజు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు అని ప్రశ్నించారు. బీసీలను అణిచివేసేందుకు ప్రభుత్వం ఇలాంటి కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. ప్రభుత్వ చర్యలను తాము ఖండిస్తున్నామని బోనబోయిన శ్రీనివాస్ (Janasena leader) అన్నారు. 


జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వర రావు (Gade venkateshwar rao) మాట్లాడుతూ... విగ్రహ ఏర్పాటు దిమ్మెను అధికారులు కూల్చి వేయటం బిపి మండల్‌ను అవమానించటమే అని అన్నారు. దిమ్మె నిర్మాణ సమయంలో అధికారులు ఏం చేస్తున్నారని నిలదీవారు. వైఎస్ (YSR) విగ్రహాలు వంద గజాలకు ఒకటి ఏర్పాటు చేశారని... వాటికి లేని ఇబ్బంది బిపి మండల్ విగ్రహానికి వచ్చిందా అంటూ ఆగ్రహించారు. వైసీపీ ప్రభుత్వ (YCP government) వైఖరిని రాష్ట్ర ప్రజలు గమనించాలని అన్నారు. 

Updated Date - 2022-09-30T16:50:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising