ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆస్తి పుస్తకాలపై సీఎం ఫొటోలు ఎందుకు?

ABN, First Publish Date - 2022-12-16T01:01:33+05:30

రైతులకు తాత ముత్తాతలు నుంచి సంక్రమించిన ఆస్తి పుస్తకాలపై ముఖ్యమంత్రి ఫొటోలు ఎందుకని, పబ్లిసిటి పనులు మానుకోవాలని జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ విమర్శించారు.

రైతుభరోసా యాత్ర పోస్టర్లు ఆవిష్కరిస్తున్న మనోహర్‌, పార్టీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెనాలి అర్బన్‌, డిసెంబరు 15: రైతులకు తాత ముత్తాతలు నుంచి సంక్రమించిన ఆస్తి పుస్తకాలపై ముఖ్యమంత్రి ఫొటోలు ఎందుకని, పబ్లిసిటి పనులు మానుకోవాలని జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ విమర్శించారు. తెనాలి పార్టీ కార్యాలయంలో గురువారం రైతు భరోసా యాత్ర పోస్టరును ఆయన ఆవిష్కరించారు. ఈ నెల 18న సత్తెనపల్లిలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఆధ్వర్యంలో కౌలు రైతు భరోసాయాత్ర ప్రారంభమౌతుందన్నారు. నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో శ్రేణులు పవన్‌ యాత్రకు హాజరు కావాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులకు జనసేన అండగా నిలవాలనే ఉద్దేశ్యంతో పవన్‌ కల్యాణ్‌ ఈ యాత్ర చేపట్టారన్నారు. జగన్‌ పాలనలో రైతులకు కనీస హక్కుగా రావాల్సిన మద్దతు ధర, ఎరువులు, రుణాలు, సబ్సిడీలు అందడం లేదని, రాష్ట్రంలో గత మూడేళ్లలో సుమారు 3వేల మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి నియోజకవర్గంలో 46 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం ఎంతో దారుణమన్నారు. పల్నాడు ప్రాంతంలో ఎక్కువ మంది కౌలు రైతులు మృతి చెందుతున్నప్పటికీ ప్రభుత్వం ఎలాంటి భరోసా కల్పించడం లేదని, రైతు భరోసా కేంద్రాలు అలంకార ప్రాయంగా మిగిలాయని అన్నారు. నియోజకవర్గంలో 7 లక్షల క్వింటాళ్ల వరి పండితే ఇప్పటి వరకు 900 క్వింటాళ్లు మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేయడం చూస్తే రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి కనబడుతుందన్నారు. దళారులు రైతుల పం టను అడ్డగోలుగా దోచుకుంటున్నారని, రైతులను కూల, మత, ప్రాంతాలుగా విడగొట్టకుండా ధాన్యం కొనుగోలు చేసి ఆదుకోవాల్సి ఉందన్నారు. గతంలో కొన్న ధాన్యానికి ఇప్పటికి డబ్బులు ఇవ్వని పరిస్థితులు ఉన్నాయని, రైతులకు ప్రభుత్వం రూ.320 కోట్లు బకాయి పడటం ఎన్నడూ లేదన్నారు. వర్షాలకు నష్టపోయిన రైతుల ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేసి డబ్బులు కూడా వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. సాగు నీరు, మురుగు నీటి కాల్వలో పూడిక తీయలేదు గాని రైతుల పాసు పుస్తకాలపై జగన్‌ ఫొటో వేసుకుంటారని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు బోనబోయిన శ్రీనివాస్‌యాదవ్‌, గాదె వెంకటేశ్వరరావు, కళ్యాణం సాంబశివరావు, అమ్మిశెట్టి వాసు, విజయ్‌శేఖర్‌, రవికాంత్‌, సురేష్‌, మురళీకృష్ణ, మధుబాబు తదితరులు పాల్గొన్నారు.

18న ధూళ్లిపాళ్లలో జనసేన రైతుభరోసా యాత్ర

సత్తెనపల్లి: ఈనెల18న సత్తెనపల్లి మండలం ధూళ్లిపాళ్ల గ్రామంలో జనసేన ఆధ్వర్యంలో కౌలురైతు భరోసా యాత్ర జరుగుతుందని జనసేన రాష్ట్ర కార్యదర్శి బి. శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. గురువారం పట్టణంలోని జనసేన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి గుంటూరు జిల్లాలో మృతి చెందిన 300 మంది కౌలు రైతుల కుటుంబాలకు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఒక్కొక్కరికి రూ.లక్ష చెక్కును అందిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని జనసేన నేతలు, కార్య కర్తలు, అభిమానులు పాల్గొని జయప్రదం చేయాలన్నారు. సమావే శంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, రాష్ట్ర నేతలు నాయబ్‌కమల్‌, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T01:01:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising