ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పక్కా గృహాల్లో పురోగతి ఉండాలి

ABN, First Publish Date - 2022-12-15T00:19:52+05:30

జగనన్న కాలనీల్లో పక్కా గృహాల నిర్మాణంలో పురోగతి కనిపించాలని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ తెలిపారు.

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ కె.విజయకృష్ణన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రుణ గృహీతలు పనులు ప్రారంభించేలా చూడాలి

సమీక్షలో అధికారులను ఆదేశించిన కలెక్టర్‌ విజయకృష్ణన్‌

బాపట్ల, డిసెంబరు 14: జగనన్న కాలనీల్లో పక్కా గృహాల నిర్మాణంలో పురోగతి కనిపించాలని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ తెలిపారు. జగనన్నకాలనీల్లోని గృహ నిర్మాణాల పురోగతిపై ఆశాఖాధికారులతో బుధవారం స్పందన సమావేశ మందిరంలో కలెక్టర్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రుణం పొందిన వారంతా పక్కాగృహాల నిర్మాణాలు ప్రారింభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ ప్రాధాన్యతను గుర్తించి చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. లేఅవుట్లలోని ఎన్ని స్థలాలకు రుణాలిచ్చారో వాటిన్నింటిలో గృహనిర్మాణాలు చూపించాలన్నారు. రుణాలు వ్యక్తిగత అవసరాలకు వినియోగించడం మంచిదికాదన్నారు. వేమూరులో ఏర్పాటు చేయాల్సిన గృహనిర్మాణశాఖ డివిజన్‌ ఇంజనీర్‌ కార్యాలయాన్ని నేటికీ గుంటూరు జిల్లా తెనాలిలో కొనసాగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రోజుల్లో కార్యాలయాన్ని తరలించాలని ఆదేశించారు. చీరాల, పర్చూరు, అద్దంకి, రేపల్లె నియోజకవర్గాల్లో నిర్దేశించిన లక్ష్యాలు చేరుకోవడంలేదన్నారు. పనిచేసే అధికారులే జిల్లాలో ఉండాలని, ఆసక్తి లేని వారు ఇతర జిల్లాలకు వెళ్లిపోవచ్చని హెచ్చరించారు. గడిచిన నెలలో 8,664 గృహ నిర్మాణాలు లక్ష్యంగా కాగా ప్రస్తుతం 4,800 మాత్రమే ప్రారంభించడంపై నిలదీశారు. పట్టణప్రాంతాల్లో గృహనిర్మాణాల పురోగతి ఆశించిన స్థాయిలో లేదన్నారు. సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ డాక్టర్‌ పి.అర్జునరావు, మెప్మా పీడీ టి.రవికుమార్‌, డ్వామా పీడీ వై.శంకర్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

జలజీవన్‌ పనులు వేగవంతం చేయాలి

రానున్న వేసవి దృష్టిలో పెట్టుకుని జలజీవన్‌మిషన్‌ పథకం పనులను వేగవంతం చేయాలని అధికారులు కలెక్టర్‌ కె.విజయకృష్ణన్‌ ఆదేశించారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజనీర్లతో జరిగిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ జిల్లాలో తొలి విడత 699 పనులకు రూ.382.24 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. తాజాగా మరో 723 పనులకు రూ.205.22 కోట్లు జిల్లాకు కేటాయించారన్నారు. నిధులు సిద్ధంగా ఉన్నా పనులు ప్రారంభించకపోడం ఏమిటని నిలదీశారు. తాగునీటి సమస్య అధికంగా ఉన్న కొరిశపాడు మండలంలో జలజీవన్‌ పనులు సాగక పోవడంపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక మరుగుదొడ్ల భవనసముదాయాల నిర్మాణాల పురోగతిపై ప్రతిరోజు నివేదికను కలెక్టరేట్‌కు పంపించాలన్నారు. సమావేశంలో ఎస్‌ఈ విద్యాసాగర్‌, డ్వామా పీడీ వై.శంకర్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T00:21:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising