గుంటూరుకి.. ఐటీసీ మకుటం
ABN, First Publish Date - 2022-01-13T06:04:34+05:30
గుంటూరు నగరానికి ఐటీసీ ఫైవ్‌స్టార్ వెల్‌కం హోటల్ మకుటం లాంటిదని సీఎం జగన్ తెలిపారు.
హోటల్ ప్రారంభోత్సవంలో సీఎం జగన్
ఎగ్జిబిషన్‌ను సందర్శించిన సీఎం, సంస్థ చైర్మన్
గుంటూరు, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): గుంటూరు నగరానికి ఐటీసీ ఫైవ్‌స్టార్ వెల్‌కం హోటల్ మకుటం లాంటిదని సీఎం జగన్ తెలిపారు. బుధవారం విద్యానగర్ రింగురోడ్డులో నిర్మించిన హోటల్‌ను ఆయన ప్రారంభించారు. తాడేపల్లి నుంచి హెలీకాప్టర్‌లో పోలీస్‌పెరేడ్ గ్రౌండ్‌కు వచ్చిన సీఎంకు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో హోటల్‌కు చేరుకున్న సీఎంకు ఐటీసీ గ్రూపు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ పూరి పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. ఆ తర్వాత ఐటీసీ ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ని సీఎం సందర్శించారు. అనంతరం హోటల్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. రూ.300 కోట్ల పెట్టుబడితో ప్రీమియం హోటల్ నిర్మించడం గుంటూరు ప్రాంతానికి గర్వకారణమన్నారు. ఐటీసీ సంస్థతో తము వివిధ రంగాల్లో భాగస్వామ్యమై ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు చర్యలు తీసుకొంటామన్నారు.
ఐటీసీ భాగస్వామ్యంతో ఫుడ్‌ప్రాసెసింగ్
ఐటీసీ భాగస్వామ్యంతో రాష్ట్రంలో ఫుడ్‌ప్రాసెసింగ్ రంగాన్ని మెరుగుపరుస్తామని సీఎం తెలిపారు. గ్రామస్థాయిలో వ్యవసాయ రంగంలో ప్రాసెసింగ్ వ్యవస్థకు మౌలిక వసతులను కల్పిస్తు న్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మంత్రులు సుచరిత, శ్రీరంగనాథరాజు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కలెక్టర్ వివేక్‌యాదవ్, టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి, పర్యాటక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి రజిత్‌భార్గవ్, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, ఎంపీలు అయోధ్య రామిరెడ్డి, లావు కృష్ణదేవరాయలు, నందిగం సురేష్, జడ్పీ చైర్‌పర్సన్ హెనీక్రిస్టినా, ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి, డొక్కా మాణిక్యవరప్రసాద్, తలశిల రఘురామ్, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, గుంటూరు మేయర్ మనోహర్‌నాయుడు, ఎమ్మెల్యేలు మద్దాళి గిరి, ముస్తఫా, బ్రహ్మనాయుడు, రజని, శంకరరావు, డాక్టర్ శ్రీదేవి, శివ కుమార్, నాగార్జున, అంబటి రాంబాబు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు లాలుపురం రాము, యార్లగడ్డ భాగ్యలక్ష్మి, జేసీలు దినేష్‌కుమార్, అనుపమ అంజలి, తెనాలి సబ్‌కలెక్టర్ మీనా, మిర్చియార్డు చైర్మన్ ఏసురత్నం, డిప్యూటీ మేయర్లు వజ్రబాబు, సజీలా, మాజీ ఎమ్మెల్యే వేణుగోపాలరెడ్డి, కమిషనర్ అనురాధ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-01-13T06:04:34+05:30 IST