ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హెచ్‌ఎం లేకుండా ఎలా?

ABN, First Publish Date - 2022-12-15T03:41:48+05:30

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుల పోస్టులకు కోత పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాప్‌ల భారం ఎవరు మోయాలి?

ఇక ఎంఈవోలపై ఆధారపడాల్సిందేనా!

హెచ్‌ఎం పోస్టుల కోతపై విమర్శల వెల్లువ

దేశంలో ఎక్కడా ఈ విధానం లేదు: విఠపు

కోత వద్దంటూ బొత్సకు ఎమ్మెల్సీ కత్తి లేఖ

అమరావతి, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుల పోస్టులకు కోత పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీవో 117 ప్రకారం జీవో 117 ప్రకారం 3-10 తరగతులున్న ఉన్నత పాఠశాలలో 138 మంది, 6-10 తరగతులున్న ఉన్నత పాఠశాలలో 93 మంది విద్యార్థులుంటేనే హెచ్‌ఎంతో పాటు ఫిజికల్‌ డైరెక్టర్‌(పీడీ) పోస్టులు కొనసాగుతాయి. అంతమంది విద్యార్థులు లేని స్కూళ్లలో హెచ్‌ఎం, పీడీ పోస్టులను తొలగించనున్నారు. అప్పుడు ఆ పాఠశాలలోని స్కూల్‌ అసిస్టెంట్లలో సీనియర్‌గా ఉన్నవారు ఇన్‌చార్జ్‌ హెచ్‌ఎంగా వ్యవహరిస్తారు. పేరుకు ఇన్‌చార్జ్‌ హెచ్‌ఎం అయినప్పటికీ ఆ టీచర్‌ కూడా అందరిలాగే రోజూ కనీసం 6 పీరియడ్లు బోధించాల్సి ఉంటుంది. దీంతో ప్రత్యేకంగా హెచ్‌ఎం పోస్టుకు ఉండే బాధ్యతలను ఎవరు నిర్వర్తించాలనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే పీరియడ్లు పెంచడంతో ఖాళీ సమయమే ఉండటం లేదని బాధపడతున్న టీచర్లకు అదనపు భారం మరో తలనొప్పి అవుతుందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హెచ్‌ఎం, పీడీలను తీసేశారని తెలిస్తే తల్లిదండ్రులు ఆ బడులకు పిల్లలను పంపుతారా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇది కొనసాగితే ఉన్నత పాఠశాలలు ప్రాథమిక పాఠశాలల తరహాలో మారిపోయే ప్రమాదం ఉందంటున్నారు. ఉన్నత పాఠశాలల్లో టీచర్ల జీతాలు డ్రా చేసే అధికారం హెచ్‌ఎంకు ఉంది. హెచ్‌ఎంను కోల్పోయే పాఠశాలలు ఇకనుంచి జీతాల కోసం ఎంఈవోపై ఆధారపడాలి. దీంతోపాటు పాఠశాలలో ఏది కావాలన్నా ఎంఈవోనే అడగాలి.

పథకం ప్రకారం చేస్తున్నారు: విఠపు

హెచ్‌ఎంల తొలగింపు అనేది పథకం ప్రకారం జరుగుతున్నట్లు కనిపిస్తోందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం అన్నారు. హెచ్‌ఎంలు లేని ఉన్నత పాఠశాలలు దేశంలో ఎక్కడా లేవని, తొలిసారి ఏపీలో ఇలాంటి పాఠశాలలు తెరపైకి రాబోతున్నాయన్నారు. పోస్టుల రద్దుతో మిగిలిపోయే హెచ్‌ఎంలను ఏంచేస్తారని ప్రశ్నించారు. అలాగే వ్యాయామ విద్య లేని పాఠశాలలు ఎక్కడా లేవన్నారు.

పోస్టులు తొలగించొద్దు: కత్తి నరసింహారెడ్డి

విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ఉన్నత పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు, ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులను కొనసాగించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి కోరారు. బదిలీ మార్గదర్శకాల్లో అలా సవరణలు కోరుతూ బుధవారం విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు లేఖ రాశారు. మ్యాపింగ్‌ కాకపోయినా రేషనలైజేషన్‌కు గురయ్యే ఉపాధ్యాయులకూ ఐదు పాయింట్లు ఇవ్వాలన్నారు. 2020లో బదిలీ అయి, ఇప్పుడు రేషనలైజేషన్‌కు గురవుతున్న టీచర్లకు పాత స్టేషన్‌ పాయింట్లు ఇవ్వాలని కోరారు.

Updated Date - 2022-12-15T03:41:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising