ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇళ్లు, స్థలాలు కబ్జా చేయడం గూండాల‌ ప్రవృత్తి: పవన్‌

ABN, First Publish Date - 2022-07-10T19:04:39+05:30

విజయవాడ: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడలో 'జనవాణి-జనసేన భరోసా' కార్యక్రమం నిర్వహించారు. పలువురు బాధితులు తమ సమస్యలపై ఆయనకు వినతిపత్రాలు అందజేశారు. వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పవన్ వారికి హామీ ఇచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ:  జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడలో 'జనవాణి-జనసేన భరోసా' కార్యక్రమం నిర్వహించారు. పలువురు బాధితులు తమ సమస్యలపై ఆయనకు వినతిపత్రాలు అందజేశారు. వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పవన్ వారికి హామీ ఇచ్చారు. 


పేదల కోసమే కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్

‘‘రేణిగుంట తారకరామానగర్‌లో ఓ కుటుంబానికి 2004లో వైయస్ ప్రభుత్వం ఇల్లు ఇచ్చింది. ఆ ఇంటిని లాక్కునెందుకు వైసీపీ ఎంపీటీసీ దౌర్జన్యం చేశారు. ఇలాంటి ఘటనలో తరుచూ జరుగుతున్నా.. యథా రాజా తథా ప్రజా రీతిలో వైసీపీ పాలన సాగుతోంది. ఈ తరహా ఘటనల వల్లే తీవ్రవాద ఉద్యమాలు పుట్టుకొస్తాయి. అధికార మదంతో ఇలా చేస్తారని నేను గతంలోనే చెప్పాను. పేదల ఇబ్బందులు, సమస్యల పరిష్కారం కోసమే కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టా. హోం మంత్రి,  అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలి. వైసీపీ నాయకులు, కార్యకర్తలు నన్ను చాలా రకాలుగా బెదిరిస్తున్నారు. నేను వారికి భయపడను... పేదల జోలికి వస్తే ఊరుకోను’’ అని పవన్ హెచ్చరించారు.



Updated Date - 2022-07-10T19:04:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising