ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డాక్టర్‌ శంకరనారాయణకు ఎన్టీఆర్‌ పురస్కారం

ABN, First Publish Date - 2022-05-29T06:14:17+05:30

స్థానిక బృందావన్‌ గార్డెన్స్‌ శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై కేఆర్‌కే ఈవెంట్స్‌ నిర్వహణలో ఎన్టీఆర్‌ కళాపరిషత్‌ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ శతజయంతి సంబరాలు శనివారం ముగిశాయి.

డాక్టర్‌ శంకరనారాయణను సన్మానిస్తున్న నిర్వాహకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు(సాంస్కృతికం), మే 28: స్థానిక బృందావన్‌ గార్డెన్స్‌ శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై కేఆర్‌కే ఈవెంట్స్‌ నిర్వహణలో ఎన్టీఆర్‌ కళాపరిషత్‌ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ శతజయంతి సంబరాలు శనివారం ముగిశాయి.  హాస్యావధాని డాక్టర్‌ శంకరనారాయణను ఎన్టీఆర్‌ శత జయంతి పురస్కారంతో ఘనంగా సత్కరించారు.  సభకు సంస్థ వ్యవస్థాపకులు రామకృష్ణప్రసాద్‌ కాట్రగడ్డ అధ్యక్షత వహించారు.  పరిషత్‌ గౌరవ అధ్యక్షులు దేవినేని కరుణ చంద్రబాబు, ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్‌ మస్తానయ్య, చార్టర్డ్‌ అకౌంటెంట్‌ ముప్పాళ్ళ సుబ్బారావు, శ్రీశ్రీ కళావేదిక అధ్యక్షులు గుత్తా హరిసర్వోత్తమ నాయుడు, పద్మశ్రీ ఎన్టీఆర్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ వ్యవస్థాపకులు మద్ది వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొని  శంకరనారాయణను ఎన్టీఆర్‌ శతజయంతి పురస్కారంతో, రంగస్థల నటీమణులు టి.లక్ష్మి, వై.భవానిలను అభినందన సత్కారంతో సన్మానించారు. సభానంతరం గోవిందరాజుల నాగేశ్వరరావు రచించిన కొల్లా రాధాకృష్ణ దర్శకత్వం వహించిన కళాంజలి హైదరాబాద్‌ వారు ప్రదర్శించిన పాశం నాటిక ప్రేక్షకులను ఆకట్టుకుంది. 


Updated Date - 2022-05-29T06:14:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising