ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Alapati, Nakka anand: అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నాం

ABN, First Publish Date - 2022-08-12T19:51:18+05:30

పేదవాడికి పట్టెడన్నం పెట్టాలన్న అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నామని మాజీ మంత్రులు ఆలపాటి రాజా, నక్కా ఆనంద బాబు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: పేదవాడికి పట్టెడన్నం పెట్టాలన్న అన్న ఎన్టీఆర్ (NTR)స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నామని మాజీ మంత్రులు ఆలపాటి రాజా (Alapati raja), నక్కా ఆనంద బాబు (Nakka anand babu) అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... గత చంద్రబాబు నాయుడు (Chandrababu ) ప్రభుత్వంలో అన్న క్యాంటీన్ (Anna canteen) ఏర్పాటుచేసి పేదవారికి ఐదు రూపాయల భోజనాన్ని పంపిణీ చేశారన్నారు.  జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కక్షపూరితంగా వ్యవహరించి అన్న క్యాంటీన్లు ఎత్తివేయటం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదవాడికి పట్టడన్నం పెట్టలేని ప్రభుత్వలు ఎందుకని ప్రశ్నించారు. టీడీపీ (TDP) ఆధ్వర్యంలో దాతల సహాయంతో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయటం జరుగుతుందని తెలిపారు. రాబోయే రోజుల్లో ఎక్కడ పేదవాడు ఆకలి అంటే అక్కడ అన్న క్యాంటీన్లు పెడతామని స్పష్టం చేశారు. ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని పేదవాడి కృషికి పాటుపడితే మంచిదని హితవుపలికారు. పట్టడం పెట్టలేని ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో టీడీపీ అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్ పునరుద్ధరిస్తామని ఆలపాటి రాజా, నక్కా ఆనంద బాబు  తెలిపారు.

Updated Date - 2022-08-12T19:51:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising