ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అసత్య ప్రచారాలతో వైసీపీ నీచ రాజకీయాలు

ABN, First Publish Date - 2022-08-04T05:43:00+05:30

అసత్య ప్రచారాలతో వైసీపీ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని మాజీ ఎమ్మెల్యే యరపతి నేని శ్రీనివాసరావు ఆరోపిం చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు 

పిడుగురాళ్ల, ఆగస్టు 3: అసత్య ప్రచారాలతో వైసీపీ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని మాజీ ఎమ్మెల్యే యరపతి నేని శ్రీనివాసరావు ఆరోపిం చారు. తెలుగు ప్రజల ఆరాధ్య దైవం ఎన్టీ రామారావు చిన్న కుమార్తె ఉమా మహేశ్వరి మృతిపై వైసీపీ సోషల్‌ మీడియా చేస్తున్న అసత్య ప్రచారాలను ఆయన బుధవారం ఓ ప్రకటనలో ఖండించారు. ఈ తీరు చూస్తే వైసీపీ ఎంత పతనావస్థలో ఉందో అర్ధం అవుతుందన్నారు. సహజ మరణానికి కూడా దురుద్దేశాలు ఆపాదించి చంద్రమోహనరెడ్డి చేసినపనులే అందరూ చేస్తారను కోవటం అవివేకమన్నారు. సొంత బాబాయిని హత్యచేసి దానిని చంద్రబాబు, తెలుగుదేశం పార్టీపై నెట్టాలని చూస్తే.. నిజానిజాలు ఒక్కొక్కటిగా తెలుసుకుంటున్న ప్రజలు ముక్కున వేలేసుకుంటు న్నారని తెలిపారు. సీఎం జగన్‌ తన తల్లిని, చెల్లిని అవమానించి ఇంటి నుంచి బయటకు పంపారని ఆరోపించారు. ఎన్టీ రామారావు, చంద్రబాబు కుటుంబాలు సమాజంలో విలువలతో కూడిన స్థానంలో ఉన్నాయని గుర్తుచేశారు. ప్రస్తుతం జగన్‌ మంత్రివర్గంలో ఉన్న బొత్స సత్యనారా యణ, ధర్మాన ప్రసాదరావు అదే జగన్‌పై, రాజశేఖరరెడ్డి మరణంపై గతంలో ఏంమాట్లాడారో గుర్తు తెచ్చుకోవాల న్నారు. రాజశేఖరరెడ్డి మరణం వెనుక జగన్మోహనరెడ్డి హస్తం ఉందనే అనుమానాన్ని ఆనాడు బొత్స సత్యనారాయణ వ్యక్తంచేశారని, ఆర్థిక ఉగ్రవాది జగన్మోహనరెడ్డిని ఉరి తీయాలని ధర్మాన ప్రసాదరావు కూడా మాట్లాడారని అన్నారు. వైసీపీ సోషల్‌మీడియా నాయకులు ఇకనైనా పద్ధతిగా ప్రవర్తిస్తే మంచిదని హితవు పలికారు. గడప గడపకు వెళ్తున్న వైసీపీ నేతలు ప్రజల చేతిలో పరాభవం పొందుతున్నారని, ఎక్కడికక్కడ ప్రజలు నిలదీస్తుంటే సమాధానం చెప్పలేక వెనుదిరుగుతున్నారన్నారు. సేవ్‌ ఆంధప్రదేశ్‌, క్విట్‌ జగన్‌ నినాదంలో ప్రతి ఒక్కరు ముందుకు రావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రజల, ప్రభుత్వ ఆస్తులను తాకట్టుపెడుతూ, అమ్మేస్తూ, అప్పులుచేస్తూ రాష్ట్రాన్ని పతనావస్థకు తీసుకెళ్తున్న జగన్‌ను ప్రజలు కుర్చీ దించే రోజులు దగ్గర్లో ఉన్నాయన్నారు. ఆర్థిక ఉగ్రవాది అయిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండటం, ఆంధ్రప్రదేశ్‌ దురదృష్టమని పేర్కొన్నారు. విజ్ఞతతో ఆలోచించే రాష్ట్ర పజలు ఈసారి ఎన్నికల్లో వైసీపీని గద్దె దింపటం ఖాయమని యరపతినేని తెలిపారు.


Updated Date - 2022-08-04T05:43:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising