ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: ఆ భూములపై పూర్తి హక్కు దేవాదాయ శాఖదే: మంత్రి కొట్టు సత్యనారాయణ

ABN, First Publish Date - 2022-08-16T21:30:49+05:30

అమరావతి: మాన్యం భూములపై పూర్తి హక్కు దేవదాయ శాఖకే ఉంటుందని దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు. వాటి మీద వచ్చే ఫలసాయం మాత్రమే అర్చకులకు హక్కు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Amaravathi: మాన్యం భూములపై పూర్తి హక్కు దేవదాయ శాఖకే ఉంటుందని దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ (Endowment minister Kottu Satyanarayana) స్పష్టం చేశారు. వాటి మీద వచ్చే ఫలసాయంపై మాత్రమే అర్చకులకు హక్కు ఉంటుందని తెలిపారు. దేవదాయ శాఖలో ఉద్యోగుల కొరత ఉన్నందున...పాలనా సౌలభ్యం కోసం మాత్రమే రెవెన్యూ ఉద్యోగులను దేవదాయ శాఖలో తీసుకుంటున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలతో ధార్మిక  పరిషత్ (Dharmika Parishad) ఏర్పాటైందని, అయితే టీడీపీ హయంలో పరిషత్ ఎందుకు ఏర్పాటు చేయలేదో ఆ పార్టీ నాయకులే చెప్పాలన్నారు.


‘‘అవినీతిని అరికట్టడం, ఇతరత్రా నిర్ణయాలు తీసుకోవడంలో ధార్మిక  పరిషత్  కీలక  పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం ఏర్పాటైన ధార్మిక  పరిషత్‌లో 21 మంది సభ్యులు ఉంటారు. భూములు, దుకాణాల లీజ్‌కు సంబంధించిన వ్యవహారాల్లో అలాగే మఠాధిపతులపై చర్యలు తీసుకునే అధికారం ధార్మిక పరిషత్ ఉంటుంది. హిందు ధర్మ పరిరక్షణలో భాగంగా ప్రతి గ్రామంలో ఒక  దేవాలయానికి ధూప  దీప  నైవేద్యాలు  కోసం  నిధి  ఏర్పాటు చేస్తున్నాం. దేవాదాయ  శాఖ బపరిధిలో 4 లక్షల  ఎకరాలకు పైగా  భూములు ఉన్నాయని,  కోర్టు వివాదాల్లో ఉన్న ఆలయ భూములు, కేసుల పురోగతి తెలుసుకోడానికి త్వరలో తయారుచేయించే వెబ్‌సైట్లో పొందుపరుస్తామని’’ చెప్పారు. 

Updated Date - 2022-08-16T21:30:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising