రూ.7 కోట్ల ధాన్యం కొనుగోలు
ABN, First Publish Date - 2022-01-01T05:47:12+05:30
జిల్లాలో ఇప్పటివరకు రూ.7 కోట్ల విలువైన ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసినట్లు డీసీఎంఎస్ చైర్‌పర్సన్ యార్లగడ్డ భాగ్యలక్ష్మి తెలిపారు.
డీసీఎంఎస్ చైర్మన్ భాగ్యలక్ష్మి వెల్లడి
గుంటూరు, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇప్పటివరకు రూ.7 కోట్ల విలువైన ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసినట్లు డీసీఎంఎస్ చైర్‌పర్సన్ యార్లగడ్డ భాగ్యలక్ష్మి తెలిపారు. 420 కొనుగోలు కేంద్రాలకు డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 110 కేంద్రాలను ప్రారంభించినట్లు తెలిపారు. రైతులను ఆదుకునేలా ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 3,510 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు విలేకర్లకు తెలిపారు. డీసీఎంఎస్ సిబ్బంది కల్లాల్లో ధాన్యాన్ని పరిశీలించి రైతుల పేర్లు నమోదు చేసుకుని కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు.
కొనుగోళ్లను వేగవంతం చేయాలి : జేడీ
ధాన్యం కొనుగోళ్ళను వేగవంతం చేయాలని వ్యవ సాయశాఖ జేడీ విజయభారతి ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లు, ఈ- పంట నమోదు తదితర అంశాలపై ఏడీలతో జిల్లా కార్యలయంలో జరిగిన సమీక్షలో ఆమె ప్రసంగించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా సకాలంలో ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. సమావేశంలో డీడీలు రామాంజనేయులు, మురళి, ఏడీలు హేమలత, రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-01-01T05:47:12+05:30 IST