ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సచివాలయాలకు రోజు వారి లక్ష్యాలను నిర్దేశించాలి

ABN, First Publish Date - 2022-05-27T06:06:19+05:30

జగనన్న పేదలందరికి ఇళ్ల పథకంలో గృహనిర్మాణాలను వేగవంతం చేయాలి. ఇందుకోసం సచివాలయాలకు రోజు వారి లక్ష్యాలను నిర్దేశించి వాటిని అధిగమించేలా నిరతరం పర్యవేక్షించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సమీర్‌ శర్మ కలెక్టరుని ఆదేశించారు

చీఫ్‌ సెక్రెటరి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరైన కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చీఫ్‌ సెక్రెటరి సమీర్‌ శర్మ ఆదేశాలు

గుంటూరు, మే 26 (ఆంధ్రజ్యోతి): జగనన్న పేదలందరికి ఇళ్ల పథకంలో గృహనిర్మాణాలను వేగవంతం చేయాలి. ఇందుకోసం సచివాలయాలకు రోజు వారి లక్ష్యాలను నిర్దేశించి వాటిని అధిగమించేలా నిరతరం పర్యవేక్షించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సమీర్‌ శర్మ కలెక్టరుని ఆదేశించారు. గురువారం సచివాలయం నుంచి సీఎస్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన పనులు వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలన్నారు. పట్టణ ప్రాంతాల పరిధిలోని లే అవుట్లలో ఇళ్ల నిర్మాణాల బాధ్యత మునిసిపల్‌ కమిషనర్లదేనని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మట్లి వేణుగోపాల్‌ రెడ్డి మాట్లాడుతూ లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం మంజూరు చేసిన పనుల్లో ఇప్పటికే 21 పనులు వంద శాతం పూర్తి చేశామన్నారు. సమావేశంలో జేసీ గణియా రాజకుమారి, కమిషనర్‌ కీర్తి చేకూరి, హౌసింగ్‌ పీడీ సాయినాథ్‌కుమార్‌, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ బ్రహ్మయ్య, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ పాల్గొన్నారు.  

స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయాలి

గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలనే లక్ష్యంతోనే జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమానికి సీఎం జగన్‌ అత్యంత ప్రాధాన్యం ఇస్తోన్నారని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. గురువారం పంచాయతీరాజ్‌ కమిషనరేట్‌ కార్యాలయం నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా అధికారులతో సమీక్షించారు. గ్రామాల్లో 100 శాతం తడి, పొడి చెత్తని ఇళ్ల వద్దకు వెళ్లి సేకరించి వ్యర్థాల నిర్వహణ కేంద్రాలకు తరలించాలన్నారు.  దీనిపై కలెక్టర్‌ వేణుగోపాల్‌ రెడ్డి మాట్లాడుతూ జూన్‌ 5న గుంటూరు నగరంలో జిందాల్‌ వేస్టు టూ ఎనర్జీ ప్లాంట్‌ని సీఎం జగన్‌ ప్రారంభించనున్నారని పేర్కొన్నారు. ప్లాంట్‌కు 25 కిలోమీటర్ల పరిధిలో 103 గ్రామాల పొడి చెత్తను తరలించేందుకు చర్యలు తీసుకొంటున్నామన్నారు. సమావేశంలో పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కోన శశిధర్‌, డీఆర్‌వో కే చంద్రశేఖర్‌రావు, జడ్పీ సీఈవో శ్రీనివాసరెడ్డి, డీపీవో కేశవరెడ్డి, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ బ్రహ్మయ్య, డ్వామా పీడీ యుగంధర్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-05-27T06:06:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising