ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో భార్యభర్తలు మృతి

ABN, First Publish Date - 2022-10-07T06:04:31+05:30

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళుతూ నెల్లూరు సమీపంలో రోడ్డు ప్రమాదంలో నరసాయపాలెంగ్రామానికి చెందిన భార్యభర్తలు మృతి చెందిన సంఘటన గురువారం తెల్లవారుజామున జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఆపస్మారక స్థితిలో కుమారుడు


బాపట్లరూరల్‌, అక్టోబరు 6 : తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళుతూ నెల్లూరు సమీపంలో రోడ్డు ప్రమాదంలో నరసాయపాలెంగ్రామానికి చెందిన భార్యభర్తలు మృతి చెందిన సంఘటన గురువారం తెల్లవారుజామున జరిగింది. బాపట్ల మండలం నరసాయపాలెం గ్రామానికి చెందిన మాలపాటి సుబ్బారావు (71), అతని భార్య సుబ్బారావమ్మ  (70), కుమారుడు మాలపాటి శోభనబాబులు గురువారం తిరులమ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకునేందుకు తెల్లవారుజామున కుటుంబ సభ్యులతో కలిసి మూడుకార్లల్లో తిరుపతి బయలుదేరారు. రెండుకార్లు కాళాహాస్తీ సమీపంలోకి చేరుకోగా మాలపాటి సుబ్బారావు ప్రయాణం చేస్తున్న కారును నెల్లూరు సమీపంలోకి చేరుకోగానే ఓ లారీ వెనక నుంచి రాసుకుంటూ వెళ్లింది. వెంటనే వారు ఆ లారీని నిలుపుదల చేసి లారీ డ్రైవరుతో మాట్లాడుతున్నారు. అదే సమయంలో హైదరాబాద్‌ నుంచి నెల్లూరు వెళుతున్న ఆర్టీసి బస్సు వేగంగా వెనుక నుంచి సుబ్బారావు, సుబ్బరావమ్మలు కూర్చున్న కారును ఢీ కొనటంతో వారిద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. వారితోపాటు కారులోవున్న వారి కుమారుడు శోభనబాబుకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అతనిని  చికిత్స నిమిత్తం నెల్లూరులోని వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం శోభనబాబు అపస్మారక స్థితిలో ఉన్నారు. ఈఘటనతో నరసాయపాలెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు.

Updated Date - 2022-10-07T06:04:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising