ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అగ్నిపథ్ స్కీంపై పునరాలోచన చేయాలి: వామపక్ష నాయకులు

ABN, First Publish Date - 2022-06-22T01:05:53+05:30

విజయవాడ: అగ్నిపథ్ స్కీం వల్ల లక్షల మంది యువకులు నిరుత్సాహానికి లోనయ్యారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. కేంద్రం ప్రభుత్వ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేలా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: అగ్నిపథ్ స్కీం వల్ల లక్షల మంది యువకులు నిరుత్సాహానికి లోనయ్యారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. కేంద్రం ప్రభుత్వ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేలా నిర్ణయం తీసుకోవడం దుర్మార్గమన్నారు. కేంద్ర నిర్ణయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమర్ధించడం మంచిది కాదన్నారు. అగ్నిపథ్ స్కీంపై పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. అగ్నిపథ్ స్కీంకు వ్యతిరేకంగా విజయవాడ దాసరి భవన్‌లో సంఘీభావ సదస్సు ఆయన మాట్లాడారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ యువత భవిష్యత్‌ను దెబ్బతీసేందుకు అగ్నిపథ్‌ను తీసుకురావడం దుర్మార్గపు ఆలోచన అని పేర్కొన్నారు. ఏపీలో 31 మంది యువకులపై కేసులు బనాయించారని, అరెస్టయిన యువకులకు వామపక్షాలు అండగా ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం జాతీయ కార్యదర్శి బినయ్ విశ్వం తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-06-22T01:05:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising