ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో దళితులపై లెక్కలేనన్ని దాడులు : శ్రావణ్ కుమార్

ABN, First Publish Date - 2022-07-02T22:42:56+05:30

అమరావతి: ఏపీలో దళితులు, బహుజనులపై లెక్కలేనన్ని దాడులు జరిగాయని జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది శ్రావణ్ కుమార్ ఆరోపించారు. నెల్లిమర్లలో దళితులు కులాంతర వివాహం చేసుకుంటే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీలో దళితులు, బహుజనులపై లెక్కలేనన్ని దాడులు జరిగాయని జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు,  హైకోర్టు న్యాయవాది  శ్రావణ్ కుమార్ ఆరోపించారు. నెల్లిమర్లలో దళితులు కులాంతర వివాహం చేసుకుంటే జీరించుకోలేని అగ్రవర్ణాలు దాడులకు తెగబడ్డాయని, దళితులు వివక్షతకు గురవుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. 

పోలీసులు తీరును హైకోర్టులో ఫైల్ చేస్తా..

‘‘23 కేసులు, రౌడీషీట్ ఉన్నఎమ్మెల్సీ అనంత్ బాబు బెయిల్ కోసం అప్లయ్ చేసుకుంటే.. ఆయన సచ్చీలుడని పోలీసులు అఫిడవిట్ ధాఖలు చేస్తారా? పోలీసులు తీరును హైకోర్టులో ఫైల్ చేస్తా. దళితులపై దాడులు, దౌర్జన్యాలను జై భీమ్ భారత్ పార్టీ చూస్తూ ఊరుకోదు.  కోనసీమకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడంలో కూడా రాజకీయం చేసిన నీచమైన వ్యక్తి జగన్. దళితులపై దాడులకు తెగబడుతున్న జగన్ ప్రభుత్వానికి దళితులు, బహుజనులను ఓటు అడిగే నైతిక హక్కు లేదు. మా దళిత బిడ్డల ప్రాణాలు, మానాలు లెక్కలేదా? జగన్ ప్రభుత్వం దళితులను చంపి, డోర్ డెలివరీ చేసే స్థాయికి చేరింది. జగన్ ధమనకాండపై దళితులు, బహుజనులు, మైనారిటీలు ఆలోచన చేయాలి. దళితులు ప్రతిఘటించలేరనా?ప్రశ్నించలేరనా? రానున్న రోజుల్లో దళితులు, బహుజనులు జగన్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు.’’ అని శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు.  

Updated Date - 2022-07-02T22:42:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising