ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భవన నిర్మాణాలకు అనుమతి తప్పనిసరి

ABN, First Publish Date - 2022-06-30T05:20:00+05:30

నగరంలో జరిగే నిర్మాణాలు నగర పాలక సంస్థ నుంచి అనుమతి తప్పనిరసరి అని కమిషనర్‌ కీర్తి చేకూరి స్పష్టం చేశారు.

స్తంభాలగరువులో భవనం కొలతలను తనిఖీ చేస్తున్న కమిషనర్‌ కీర్తి చేకూరి, అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నగర కమిషనర్‌ కీర్తి చేకూరి

గుంటూరు(కార్పొరేషన్‌), జూన్‌ 29: నగరంలో జరిగే నిర్మాణాలు నగర పాలక సంస్థ నుంచి అనుమతి తప్పనిరసరి అని కమిషనర్‌ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. బుధవారం స్థంబాలగరువులో ఎన్‌ఓసీకి దరఖాస్తు చేసుకున్న భవనాల కొలతలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ బహుళ అంతస్తు భవనాలు నిర్దేశిత ప్లాన్‌ ప్రకారం నిర్మిస్తేనే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ జారీ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ప్లానింగ్‌ కార్యదర్శులతో మాట్లాడుతూ సచివాలయ పరిధిలో ప్లాన్‌కి విరుద్ధంగా నిర్మాణం జరిగే వాటికి నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. 

 ఆక్రమణల తొలగింపుకు యాక్షన్‌ ప్లాన్‌ 

 పీకలవాగు మీద ఆక్రమణలను  తొలగించడానికి యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేయాలని ఇంజనీరింగ్‌, పట్టణ ప్రణాళిక అఽధికారులను నగర కమిషనర్‌ కీర్తి చేకూరి ఆదేశించారు. బుధవారం కమిషనర్‌ తన చాంబర్‌లో పట్టణ ప్రణాళిక విభాగ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ కూలిపోయే స్థితిలో ఉన్న భవనాలను వాటి యజమానులే తొలగించుకునేలా నోటీసులు జారీ చేయాలన్నారు. ప్రధాన రహదారుల పక్కన, భవనాల మీద ఏర్పాటు చేసిన హోర్డింగ్స్‌ని పరిశీలించి వాటి నాణ్యతా ప్రమాణాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సమావేశంలో ఇంచార్జ్‌ సిటీ ప్లానర్‌ బాబురావు, ఏసీపీలు అశోక్‌కుమార్‌, కాలేషా, అజయ్‌కుమార్‌, టీపీఎస్‌లు భవాని, స్రవంతి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-06-30T05:20:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising