ఈకేవైసీ పూర్తైన రైతుల నుంచే ధాన్యం కొనుగోలు
ABN, First Publish Date - 2022-12-15T00:41:23+05:30
ఈకేవైసీ పూర్తైన రైతుల నుంచే ఆర్‌బీకేల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తామని కలెక్టర్ శివశంకర్ తెలిపారు.
వెల్లటూరు యార్డులో కేంద్రం ప్రారంభోత్సవంలో కలెక్టర్
బొల్లాపల్లి, డిసెంబరు 14: ఈకేవైసీ పూర్తైన రైతుల నుంచే ఆర్‌బీకేల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తామని కలెక్టర్ శివశంకర్ తెలిపారు. మండలంలోని వెల్లటూరు యార్డులో బుధవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ శివశంకర్‌తో కలిసి జేసీ శ్యామ్‌ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ మాండస్ తుపాన్ వల్ల దెబ్బతిన్న ధాన్యాన్ని కొనుగోలుకు జిల్లాలోనే తొలిగా వెల్లటూరులో కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. రైతులకు ధాన్యం విక్రయించిన 21 రోజుల లోపు ఖాతాల్లో నగదు జమఅవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ, సివిల్ సప్లయిస్ అధికారులు పాల్గొన్నారు.
నిరుద్యోగ యువతకు నవోదయం
నరసరావుపేట రూరల్: కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన నవోదయం కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించినట్లు కలెక్టర్ శివశంకర్ తెలిపారు. ఉపాధి, ఉద్యోగ, వ్యాపారాలు పెట్టుకునేందుకు సుమారు 580 మంది దరఖాస్తులు పెట్టుకున్నారన్నారు. యువతీ యువకులకు ఉద్యోగ, ఉపాధి బ్యాంక్ ద్వారా రుణాలు మంజూరు చేయాలని అర్జీలు అందజేశారు. కార్యక్రమంలో డీఆర్వో వినాయకం, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి వెంకటేశ్వరరావు, డీఆర్‌డీఏ పీడీ బాలునాయక్, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకటేశ్వర్లు, నవోదయం ప్రాజెక్టు అధికారి సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-15T00:42:05+05:30 IST