ఇంధన పొదుపు బాధ్యత అందరిది
ABN, First Publish Date - 2022-12-15T00:52:43+05:30
ఇంధన పొదుపు బాధ్యత అందరిపై ఉందని కలెక్టర్ ఎమ్ వేణుగోపాల్‌రెడ్డి సూచించారు.
జాతీయ వారోత్సవాల్లో కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి
గుంటూరు, డిసెంబరు 14: ఇంధన పొదుపు బాధ్యత అందరిపై ఉందని కలెక్టర్ ఎమ్ వేణుగోపాల్‌రెడ్డి సూచించారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలను పురస్కరించుకుని ఏపీ ఇంధన పరిరక్షణ మిషన్, ఇంధన శాఖ రూపొందించిన స్టిక్కర్లు, కర పత్రాలు, ప్రచార పోస్టర్లను ఆయన బుధవారం నగరపాలక సంస్థ కమిషనర్ కీర్తి చేకూరితో కలిసి కలెక్టర్‌లోని వీసీ సమావేశ మందిరంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డిసెంబరు 14 నుంచి 20వ తేదీ వరకు జరిగే జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా విద్యుత్ వృథాను అరికట్టడం, విద్యుత్ ఉప కరణాలు ఉపయోగించే మెళకువలతో పాటు ఇంధన పొదుపుపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. పొదుపు వారోత్సవాల్లో ఎన్‌జీవోలను, ప్రజల్ని భాగస్వామ్యం చేస్తూ అవగాహన కార్యక్రమాలు విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో గుంటూరు ఆపరేషన్ సర్కిల్ ఎస్‌ఈ మురళీకృష్ణయాదవ్, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ నిర్మల, జీఎంసీ ఎస్‌ఈ భాస్కర్‌రావు, ఈఈ శ్రీనివాసబాబు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, నేషనల్ హైవే అధికారులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-15T00:52:49+05:30 IST