ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మువ్వన్నెల జెండా ఎగరాలి

ABN, First Publish Date - 2022-08-12T05:52:36+05:30

ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమాల్లో భాగంగా ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగరాలని కలెక్టర్‌ శివశంకర్‌ తెలిపారు.

విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేస్తున్న కలెక్టర్‌ శివశంకర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటింటికీ వలంటీర్లు పంపిణీ చేయాలి

హెరిటేజ్‌ వాక్‌ ప్రారంభోత్సవంలో కలెక్టర్‌ శివశంకర్‌

దుర్గి, ఆగస్టు 11: ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమాల్లో భాగంగా ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగరాలని కలెక్టర్‌ శివశంకర్‌ తెలిపారు. దుర్గిలో గురువారం కలెక్టర్‌   పర్యటించారు. ఈ సందర్భంగా జడ్పీ ఉన్నత పాఠశాల వద్ద నుంచి ప్రారంభమైన హెరిటేజ్‌ వాక్‌ను ఆయన ప్రారంభించారు. ఈ వాక్‌ మండల పరిషత్‌ కార్యాలయం వరకు జరిగింది. సుమారు 600 మీటర్ల జాతీయ పతాకంతో కిలో మీటరు మేర సాగిన ఈ ర్యాలీ పలువురిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌,  ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆర్డీవో అద్దెయ్య, ఇన్‌చార్జి తహసీల్దారు రమేష్‌కుమార్‌, ఎంపీడీవో బాలునాయక్‌, ఎంఈవో అల్లి సురేష్‌, మార్కెట్‌యార్డు చైర్మన్‌ గోపాల్‌, జడ్పీటీసీ శెట్టిపల్లి యలమంద, ఎంపీపీ యేచూరి సునీత, ఉన్నం పెద్దబ్బాయి, సర్పంచ్‌ చాట్ల శాంత రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి ఇంటికి జాతీయ జెండాలను వలంటీర్లు పంపిణీ చేయాలన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు కన్నెగంటి హనుమంతుకు నివాళులర్పించి ఆయన వారసులను సత్కరించారు. అనంతరం  కలెక్టర్‌   మండలంలోని మించాలపాడులోని హనుమంతు సమాధిని సందర్శించారు. స్థానిక కస్తూర్బా బాలికల వసతి గృహానికి వెళ్లి విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా వసతి గృహానికి రహదారి సదుపాయం కల్పించాలని కలెక్టర్‌ దృష్టికి తీసుకురాగా ఆయన పరిశీలించారు. నాగార్జున శిల్పకళాకేంద్రంలో శిల్పాల తయారీని పరిశీలించారు. 


Updated Date - 2022-08-12T05:52:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising