ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులను సీఎం ఆదుకోవాలి: నారా లోకేష్

ABN, First Publish Date - 2022-06-12T02:24:58+05:30

Amaravathi: అన్నదాతలను ఆదుకోవాలని టీడీపీ జాతీయ కార్యదర్శి నారాలోకేష్ సీఎం జగన్‌కు లేఖ రాశారు. రైతులు క్రాప్‌హాలీడే విర‌మించేలా చ‌ర్య‌లు తీసుకోవాలని కోరారు. సరైన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Amaravathi: అన్నదాతలను ఆదుకోవాలని టీడీపీ జాతీయ కార్యదర్శి నారాలోకేష్ సీఎం జగన్‌కు లేఖ రాశారు. రైతులు క్రాప్‌హాలీడే విర‌మించేలా చ‌ర్య‌లు తీసుకోవాలని కోరారు. సరైన గిట్టుబాటు ధర లభించకపోవడంతో.. క్రాప్‌హాలీడే వైపు రైతులు మొగ్గు చూపుతున్నారని లోకేష్ పేర్కొన్నారు. 

ఇంకా ఏమన్నారంటే..

‘‘క‌డ‌ప‌ జిల్లాలో నీరు పుష్కలంగా ఉన్నా గ‌తేడాది నుంచి రైతులు పంట విరామం కొనసాగిస్తున్నారు. గోదావ‌రి జిల్లాలు, అనంతపురం, కర్నూలు, నెల్లూరులో పలు ప్రాంతాల్లో ఇప్పటికే పంట విరామం ప్రకటించారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 5 లక్షల ఎకరాల్లో మిర్చి వేసి నష్టపోయిన రైతులకు ప్ర‌భుత్వం ఒక్క రూపాయి పరిహారం కూడా ఇవ్వక‌పోవ‌డం దారుణం. మా ప్ర‌భుత్వ హ‌యాంలో ధాన్యం బకాయిలు వారంలోనే చెల్లించగా, నేడు 3 నెలలు దాటినా బకాయిలు చెల్లించకపోవడం రైతు ద్రోహం కాదా? ఆత్మహత్య చేసుకున్న ఒక్కో రైతు కుటుంబానికి రూ.7 లక్షలు ఇవ్వాలి. పంట నష్టపరిహారం చెల్లించాలి. పోలవరం పూర్తిచేసి నదుల అనుసంధానం ద్వారా ఉత్తరాంధ్ర, రాయలసీమకు సాగునీరు, తాగునీరు అందించాలి. క్రాప్ హాలీడే ప్ర‌క‌టించిన ప్రాంతాల్లో మీరు నేరుగా ప‌ర్య‌టించి, ప్ర‌భుత్వం అండ‌గా వుంటుంద‌నే భ‌రోసా నింపి రైతాంగాన్ని పంట‌లు వేసేలా ప్రోత్స‌హించాలి.  

         మూడేళ్లలో ప్రకృతి వైపరీత్యాలతో 50 లక్షల ఎకరాలలో పంట నష్టం ఏర్పడితే ఒక్క రైతును కూడా ప్రభుత్వం పూర్తిగా ఆదుకోలేదు. పెట్రోల్‌, డీజిల్‌, వ్యవసాయం, యంత్ర పనిముట్లు ధరలు పెరిగిన స్థాయిలో  వ‌రి మద్దతు ధర పెంచ‌క‌పోవ‌డంతో వ్య‌వ‌సాయం న‌ష్టాల‌మ‌యం అవుతోంది. ప్రభుత్వ చర్యలతో రైతు ఆత్మహత్యలు ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే మూడోస్థానంలో ఉండగా, కౌలు రైతుల మరణాల్లో రెండో స్థానంలో నిల‌వ‌డం వ్య‌వ‌సాయ‌రంగ సంక్షోభాన్ని సూచిస్తోంది. ఇప్పటికి 3వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.’’ అని పేర్కొన్నారు.

Updated Date - 2022-06-12T02:24:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising