నగరాభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ
ABN, First Publish Date - 2022-12-16T00:41:02+05:30
నగర సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి స్పష్టం చేశారు.
ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి
గుంటూరు(కార్పొరేషన్), డిసెంబరు 15 : నగర సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఏటి అగ్రహారం మెయిన్ రోడ్లో నూతనంగా చేపట్టనున్న సీసీ డ్రెయిన్ నిర్మాణ పనులకు నగర మేయర్ కావటి మనోహర్‌నాయుడు, కమిషనర్ కీర్తి చేకూరి, ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అప్పిరెడ్డి మాట్లాడుతూ నగరంలో సుమారు రూ.150 కోట్ల విలువైన అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, త్వరలో శంకర్‌విలాస్ ఆర్వోబీ కూడా ప్రత్యేకంగా నిధులు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారన్నారు. ఏటి అగ్రహారం రోడ్ విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయని, పెండింగ్ పనులు కూడా త్వరగా చేపట్టాలని అధికారులకు సూచించారు. అనంతరం ఎమ్మెల్యే, మేయర్, కమిషనర్ ప్రసం గించారు. కార్యక్రమంలో మిర్చియార్డు చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం, డిప్యూ టీ మేయర్ షేక్ సజీలా, స్థానిక కార్పొరేటర్లు అడకా పద్మావతి, అచ్చాల వెంకటరెడ్డి, అందుగుల సంతోష్, ఎస్ఈ భాస్కర్, డీసీపీ కోటయ్య, ఈఈ సుందర్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పీవీకే నాయుడు మార్కెట్లో అధునాతన కాంప్లెక్స్
నగరంలో బహుళ అంతస్తుల మోడల్ కూరగాయల మార్కెట్ కాంప్లెక్స్ భవన నిర్మాణానికి ప్రభుత్వం అనుమతివ్వడం ఎంతో గర్వకారణమని, నగ రాన్ని అభివృద్ధిలో ఆదర్శనగరంగా తీర్చి దిద్దుతామని ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి తెలిపారు. గురువారం మేయర్ చాంబర్లో పీవీకే నాయు డు మార్కెట్, మోడరన్ కబేళాకు ప్రభుత్వం నుంచి వచ్చిన పరిపాలన ఆమోద జీవోలపై విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా అప్పిరెడ్డి మాట్లాడుతూ పీవీకే నాయుడు మార్కెట్, అధునాతన కబేళాలకు ప్రభు త్వం ఆమోద ముద్ర వేయడంలో ప్రజాప్రతినిధులు అధికారులు సమష్టి కృషి చేశారన్నారు. మేయర్, కమిషనర్, ఎమ్మెల్యేలు ముస్తఫా, గిరిధర్‌లు ప్రసంగించారు. సమావేశంలో డిప్యూటీ మేయర్లు వనమా బాల వజ్రబాబు, షేక్ సజీల, నగర పాలక సంస్థ ఎస్ఈ భాస్కర్, ఈఈ సుందర రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-16T00:42:00+05:30 IST