ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్టీఆర్‌ పేరు మార్పు ప్రభుత్వ చెత్త నిర్ణయం

ABN, First Publish Date - 2022-09-22T05:33:45+05:30

ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్చి వైఎస్సార్‌ పేరు పెట్టాలనేది రాష్ట్ర ప్రభుత్వ చెత్త నిర్ణయంగా ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌ అభివర్ణించారు.

సమావేశంలో మాట్లాడుతున్న చలసాని శ్రీనివాస్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చలసాని శ్రీనివాస్‌

గుంటూరు, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్చి వైఎస్సార్‌ పేరు పెట్టాలనేది రాష్ట్ర ప్రభుత్వ చెత్త నిర్ణయంగా ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌ అభివర్ణించారు. గుంటూరులోని గీ తా రెసిడెన్సీలో విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగామాట్లాడుతూ ‘ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం పే రును వైఎస్సార్‌ పేరుతో మార్చాలని రాత్రికి రాత్రే ఆన్‌లైన్లో క్యా బినెట్‌ తీర్మానం పెట్టాల్సిన అత్యవసర పరిస్థితి వచ్చిందా? దా నిలో వందోవంతు విభజన హామీలు, ప్రత్యేక హోదా సాధనపై పెడితే రాష్ట్రం, భావితరాలు బాగుపడేవి కాదా’ అంటూ ప్ర శ్నించారు. దేశంలోనే తొలిసారిగా ఆరోగ్య సేవలను ఒక గొడుగు కిందకి తెచ్చి అలాంటి ఆరోగ్య విశ్వవిద్యాలయం పెట్టాలనే ఆలో చన చేసింది, విశ్వవిద్యాలయాన్ని పెట్టింది అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావేనని ఆయన గుర్తు చేశారు. యూనివర్శిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌గా ఆయనే ఉన్నారన్నారు. రాష్ట్రస్థాయి విశ్వవిద్యాలయం కోస్తా, రాయలసీమల్లో కూడా ఉండాలని అప్పటికప్పుడు అ నుమతి తెచ్చుకుని, అప్పటికి రాష్ట్రంలో ఉన్న ఏకైక ప్రైవేటు వైద్యకళాశాలైన పిన్నమనేని సిద్ధార్థ కళాశాలని, దానికి విజ యవాడలో ఉన్న విలువైన భూములు, భవనాలు, ఆస్తుల్ని జా తీయం చేసి దాన్ని ఏర్పరచారన్నారు. రాయలసీమలో శ్రీ పద్మా వతి మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారన్నారు. దేశం లోనే తెలుగువారి ఆత్మగౌరవం నిలిపిన అన్నగారి పేరు మార్చి వైఎస్సార్‌ పేరుపెట్టడాన్ని పైనున్న వైఎస్సార్‌ ఆత్మ కూడా సహించదని చెప్పారు. ఎన్ని యూనివర్శిటీలకు ఇలా పెట్టుకుం టారని నిలదీశారు. యూనివర్శిటీకి ఉన్న నిధుల్లో రూ.400 కోట్ల నిధులను పక్కదారి పట్టించారని విమర్శించారు. టీడీపీ పాల నలో కాసు బ్రహ్మానందరెడ్డి, జలగం వెంగళరావు, మర్రి చెన్నారెడ్డి పేరు మీద పార్కులు, సంస్థలు ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు.  విభజన హామీలు, ప్రత్యేక హోదా సాధనపై ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు. హక్కుల సాధన కోసం గళం విప్పాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో యు.రఘురామ్‌, జంగాల అజయ్‌ కుమార్‌, మల్లికార్జునరావు, మాల్యాద్రి, నరసింహారావు, భాష్యం నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-09-22T05:33:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising