ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెరుగైన సేవల కోసమే సౌకర్యాలు

ABN, First Publish Date - 2022-12-16T00:38:55+05:30

జిల్లాలో ప్రజలకు మెరుగైన సేవలందించటానికి పోలీసుశాఖకు అవసరమైన కనీస సౌకర్యాలు ఒకదాని తర్వాత మరొకటి కల్పిస్తున్నట్లు ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపారు.

క్యాంప్‌ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న ఎస్పీ వకుల్‌ జిందాల్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

క్యాంప్‌ కార్యాలయ ప్రారంభోత్సవంలో ఎస్పీ జిందాల్‌

బాపట్ల, డిసెంబరు 15: జిల్లాలో ప్రజలకు మెరుగైన సేవలందించటానికి పోలీసుశాఖకు అవసరమైన కనీస సౌకర్యాలు ఒకదాని తర్వాత మరొకటి కల్పిస్తున్నట్లు ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపారు. పోలీసు కార్యాలయ సమీపంలోని వ్యవసాయ ఇంజనీరింగ్‌ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎస్పీ క్యాంప్‌ కార్యాలయాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎస్పీ క్యాంప్‌ కార్యాలయం, నివాస భవనానికి తగిన విధంగా పునర్‌ నిర్మాణం చేసినట్లు తెలిపారు. ఇప్పటికే ఆర్మడ్‌ రిజర్వు పోలీసు సిబ్బందికి అవసరమైన ఏఆర్‌ కార్యాలయం, కవాతు మైదానం, మినరల్‌ వాటర్‌ప్లాంట్‌ ఏర్పాటు చేశామన్నారు. నేరాల నియంత్రణకు నైపుణ్యం ఉన్న పోలీసు అధికారులు, సిబ్బందితో జిల్లాసెంట్రల్‌ క్రైమ్‌ విభాగాన్ని ఏర్పాటు చేసి వారికి వెదుళ్లపల్లి పోలీసుస్టేషన్‌ దగ్గరలో భవనాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

కోడిపందాలపై చర్యలు తీసుకోవాలి

జిల్లాలో కోడిపందాలు, పేకాట నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ వకుల్‌ జిందాల్‌ ఆదేశించారు. పోలీసు అధికారులతో బాపట్లలో గురువారం జరిగిన నేర సమీక్షలో ఆయన మాట్లాడారు. క్రిస్మస్‌, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగలు వస్తున్న తరణంలో తగిన ముందస్తు భద్రత చర్యలు తీసుకోవాలన్నారు. డయల్‌ 100 కాల్స్‌కు త్వరితగతిన స్పందించాలని, నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటి పనితీరు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలన్నారు. జాతీయ, రాష్ర్టీయ రహదార్లపై అనుమతులులేని పార్కింగ్‌లపై చర్యలు తీసుకోవాలన్నారు. సాయంత్రం వేళల్లో బ్యాంక్‌లు, ఏటీఎమ్‌లు, కళాశాల వద్ద విజిబుల్‌ పోలీసింగ్‌ నిర్వహించాలన్నారు. ప్రస్తుతం విపరీతంగా పొగమంచు కురుస్తున్న కారణంగా రహదార్లపై ఉండే డ్రమ్మ్‌లను రాత్రుళ్లు తొలిగించాలని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో అడిషనల్‌ ఎస్పీ పి.మహేష్‌, డీఎస్పీలు ఎ.శ్రీనివాసరావు, పి.శ్రీకాంత్‌, టి.మురళీకృష్ణ, ఏఆర్‌ డీఎస్పీ ఎండీహెచ్‌ ప్రేమ్‌కుమార్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎ.శ్రీనివాస్‌, సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.మురళీకృష్ణ, అడ్మిన్‌ ఆర్‌ఐ ఎల్‌.మన్మఽథరావు, వెల్ఫేర్‌ ఆర్‌ఐ బి.శ్రీకాంత్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T00:39:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising