ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాహిత్యానికి సాంకేతిక విజ్ఞానం జోడించాలి

ABN, First Publish Date - 2022-06-08T05:13:48+05:30

భావి తరాలకు సాహిత్యం చేరేందుకు సాంకేతిక విజ్ఞానం జోడించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర సాంకేతిక విద్యా కమిషనర్‌ పోలా భాస్క ర్‌ పేర్కొన్నారు.

పురస్కారాలను అందుకుంటున్న సినీ రచయిత సంజీవి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐఏఎస్‌ అధికారి పోలా భాస్కర్‌

బొల్లిముంత సాహితీ పురస్కారాల ప్రదానం

తెనాలి అర్బన్‌, జూన్‌ 7: భావి తరాలకు సాహిత్యం చేరేందుకు సాంకేతిక విజ్ఞానం జోడించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర సాంకేతిక విద్యా కమిషనర్‌ పోలా భాస్క ర్‌ పేర్కొన్నారు. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరుగుతున్న తెలుగు సాహితీ సాంస్కృతిక మహోత్సవ సభలో మంగళవారం ఆయన పాల్గొన్నారు. పూర్వ శాస్త్రవేత్త చందు సాంబశివరావు అధ్యక్షతన జరిగిన సభలో బొల్లిముంత శివరామకృష్ణ సాహితీ పురస్కారాల ను ఉత్తరాంధ్ర కథా రచయిత అట్టాడ అప్పలనాయుడు, సినీ రచయి త ఎం.సంజీవిలకు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  మారుతున్న సమాజానికి అనుగుణంగా సాహిత్యం ప్రజలకు చేరేందుకు అవసరమైన మార్గాన్ని అన్వేషించాలన్నారు. ఆధునికి సమా జంలో సాహిత్యం అవశ్యకత అనే అంశంపై సాహిత్యవేత్త నాగసూరి వేణుగోపాల్‌ ప్రసంగించారు. పలువురు కళాకారులు, స్వచ్ఛంద సేవకులను ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఎం.సత్యనారాయణశెట్టి, అంబటి మురళీకృష్ణ, చందు సుబ్బారావు ప్రసంగించారు.  కాట్రపాడు ఉషోదయ కళానికేతన్‌ కళాకారులు ప్రదర్శించిన వసంతం నాటిక అలరించింది. ఫౌండేషన్‌ సభ్యులు కనపర్తి మధుకర్‌, బెన్‌హర్‌, వెంకట్‌, బొల్లిముంత కృష్ణ తదితరులు పర్యవేక్షించారు. 


Updated Date - 2022-06-08T05:13:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising