ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దోషులను అరెస్టు చేయాలి

ABN, First Publish Date - 2022-05-20T04:44:19+05:30

యడ్లపాడు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రహదారి మాత దేవాలయంపై ఈనెల 14న రాత్రి దాడి చేసిన దుండగులను తక్షణం అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని గుంటూరు ఆర్‌సీఎం బిషప్‌ భాగ్యయ్య డిమాండ్‌ చేశారు.

గుంటూరులోని మదర్‌థెరిస్సా విగ్రహం వద్ద నిరసన తెలుపుతున్న బిషప్‌ భాగ్యయ్య, ఫాదర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శాంతి ర్యాలీలో బిషప్‌ భాగ్యయ్య డిమాండ్‌

మరియమాత విగ్రహంపై దాడికి గుంటూరులో నిరసన 

గుంటూరు, మే 19: యడ్లపాడు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రహదారి మాత దేవాలయంపై  ఈనెల 14న రాత్రి దాడి చేసిన దుండగులను తక్షణం అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని గుంటూరు ఆర్‌సీఎం బిషప్‌ భాగ్యయ్య డిమాండ్‌ చేశారు. ఆలయంపై దాడిని నిరసిస్తూ గురువారం గుంటూరులో క్రైస్తవులు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. లక్ష్మీపురం సెంటర్‌లోని మదర్‌థెరిస్సా విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడే నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యడ్లపాడు పరిధిలోని రహదారి మాత ఆలయంలో మరియమాత, ఏసుక్రీస్తు, బాలయేసు విగ్రహాలను ధ్వంసం చేయడం క్రైస్తవ సమాజాన్ని తీవ్రంగా బాధించిందన్నారు. దుండగులు మతసామరస్యాన్ని దెబ్బతీసేందుకు మరియమాత విగ్రహానికి తాళి కట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కుల, మతాలకు అతీతంగా ప్రజలంతా క్షేమంగా ఉండాలని తాము ఆలయంలో ప్రార్థిస్తున్నామన్నారు. అటువంటి ఆలయంపై సంఘ విద్రోహ శక్తులు దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఘటన జరిగి మూడు రోజులు గడిచినా కనీసం ఇంతవరకు నిందితులను గుర్తించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఫాదర్లు బాల, ఇన్నారెడ్డి, సుందరరావు, మద్దు బాలస్వామి, చుక్కా చంద్రపాల్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-20T04:44:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising