ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లోన్‌ పేరుతో సైబర్‌ మోసం.. రూ.1.30 లక్షలు పోగొట్టుకున్న మహిళ

ABN, First Publish Date - 2022-03-07T12:17:06+05:30

లోన్‌ పేరుతో ఓ మహిళను మోసం చేసిన ఘటన ప్రత్తిపాడులో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు జిల్లా/ప్రత్తిపాడు : లోన్‌ పేరుతో ఓ మహిళను మోసం చేసిన ఘటన ప్రత్తిపాడులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రత్తిపాడులో ఓ స్కూల్‌ నడుపుతున్న వెలగా శ్రీవల్లికి గతవారం రోజులుగా బజాజ్‌ ఫిన్‌ పేరుతో పర్సనల్‌ లోన్‌ మంజూరైనట్లు ఫోన్లు వస్తున్నాయి. మీకు రూ.35లక్షల పర్సనల్‌ లోన్‌ మంజూరు అయింది. డాక్యుమెంటు చార్జీలు, ప్రాసెసింగ్‌ ఫీజు, జీఎస్టీ చెల్లిస్తే వెంటనే మీ అకౌంటుకు రూ.35 లక్షలు జమచేస్తాం అని నమ్మించారు. దీంతో ఆ మహిళ రూ.1,29,793 గూగుల్‌పే ద్వారా పంపింది. లోన్‌ అమౌంట్‌ తమ బ్యాంకు ఖాతాకు జమకాకపోవడంతో అనుమానం వచ్చిన శ్రీవల్లి తాము మోసపోయామని గ్రహించి ప్రత్తిపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్‌ఐ ప్రతాప్‌కుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-03-07T12:17:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising