ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజా సమస్యలపై అవగాహన పెంచుకోవాలి: Nadendla Manohar

ABN, First Publish Date - 2022-07-02T23:18:26+05:30

అమరావతి: రాజకీయాల్లో రాణించాలంటే ప్రజా సమస్యలపై అవగాహన పెంచుకోవాలని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సూచించారు. జనసేన వీర మహిళలకు ఏర్పాటు చేసిన శిక్షణా తరగతుల కార్యక్రమంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాజకీయాల్లో రాణించాలంటే ప్రజా సమస్యలపై అవగాహన పెంచుకోవాలని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సూచించారు. జనసేన వీర మహిళలకు ఏర్పాటు చేసిన శిక్షణా తరగతుల కార్యక్రమంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు మూడున్నర లక్షల మంది సభ్యత్వం తీసుకున్నారని చెప్పారు. క్రియాశీల కార్యకర్తలను గుర్తించి ప్రోత్సహిస్తామన్నారు. జనసేనను జనంలోకి తీసుకెళ్లేలా వీర మహిళలు కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. వైసీపీ వైఫల్యాలు, దౌర్జన్యాలను ప్రజలకు వివరించగలగాలన్నారు.  మీడియా ముందు ఎలా మాట్లాడాలి? అంశాలవారీగా ఎలా ప్రశ్నించాలో తెలుసుకోవాలన్నారు. 

పవన్‌తో కలిసి ప్రయాణం చేస్తే లక్ష్యాలు సాధిస్తాం.

‘‘పవన్ కళ్యాణ్‌కు ప్రజల్లో ఉన్న అభిమానం మీకు తెలుసు. మనమంతా ఆయనతో కలిసి ప్రయాణం చేస్తే లక్ష్యాలు సాధిస్తాం.ఎవరో పోస్ట్ పెడితే... జనసైనికులపై కేసులు పెట్టారు. పోలీసులతో కొట్టిస్తూ జగన్ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. పవన్ కళ్యాణ్ జన సైనికులకు అండగా ఉంటూ..న్యాయ విభాగాన్ని ఏర్పాటు చేశారు.’’ అని నాదేండ్ల మనోహార్ వివరించారు.  

జులై‌ 3, 10 తేదీలలో విజయవాడలో జనవాణి

‘‘ప్రజల సమస్యలు వినే తీరిక జగన్‌కు లేదు. వైసీపీ ఎమ్మెల్యే‌లు కూడా అదే పంధాలో పయనిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ముందుకు‌ వచ్చి జనవాణి కార్యక్రమం చేపట్టారు. జులై‌3, 10 తేదీలలో విజయవాడ ఎం.బి.కె భవన్ లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారు. వాటిని అధికారులు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపుదాం. మూడు వేల మంది కౌలు రైతులు ఆత్మహత్య‌లు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ రూ. 5 కోట్లు సొంతంగా నిధులు ఇచ్చి ఆదుకున్నారు. .ఏ ఒక్క రాజకీయ నాయకుడైనా ఇలా సొంత డబ్బుతో సాయం చేశారా? జగన్‌కు సిగ్గు లేకుండా ఈ సాయాన్ని కూడా అవహేళన చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ లక్ష సాయం చేసిన తరువాత ప్రభుత్వం తరపున రూ. లక్ష ఇచ్చారు ’’ అని మనోహార్ వివరించారు.

Updated Date - 2022-07-02T23:18:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising