ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బోర్‌వెల్‌ లారీ చోరీ చేసిన ముగ్గురు అరెస్టు

ABN, First Publish Date - 2022-08-19T05:54:04+05:30

అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని భారత్‌పేట 4వ లైనులో ఈనెల 16న రాత్రి బోర్‌వెల్స్‌ లారీని చోరీ చేసి న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

స్వాధీనం చేసుకున్న బోర్‌వెల్‌ లారీ, నిందితులతో అరండల్‌పేట సీఐ రామానాయక్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, ఆగస్టు 18: అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని భారత్‌పేట 4వ లైనులో ఈనెల 16న రాత్రి బోర్‌వెల్స్‌ లారీని చోరీ చేసి న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మల్లికార్జునపేట 2వ లైను కు చెందిన ప్రత్తివాడ సాం బశివరావు, ఆయన అన్న ప్రత్తివాడ చెంచురామయ్య, రత్నగిరికాలనీ 4వ లైనుకు చెందిన అభిషేక్‌లను ఏటుకూరు వద్ద అరెస్టు చేసి సంగడిగుంటలోని ఓ గోడౌన్‌లో దాచి ఉంచిన బోర్‌ వెల్స్‌ లారీని స్వాధీనం చేసుకున్నట్టు అరండల్‌ పేట సీఐ రామానాయక్‌ తెలి పారు. గురువారం తాలూకా కంపౌండ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆయన వివరాలు వెల్లడించారు. భారత్‌పేట 8వ లైనుకు చెందిన డి.రాజ్యలక్ష్మి తన బోర్‌వెల్స్‌ లారీని ఈనెల 16న రాత్రి భారత్‌పేట 4వ లైనులో పార్కు చేసింది. 17న ఉదయం వెళ్లి చూడగా లారీ కనిపించలేదు. బాధితురాలు ఫిర్యాదు మేర కు అరండల్‌పేట సీఐ రామానాయక్‌ ఆధ్వర్యంలో ఎస్‌ఐలు రామాంజనేయులు, నాగరాజు, హెడ్‌ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు ప్రత్యేక బృందంగా ఏర్పడి దర్యాప్తు చేయగా సీసీ కెమెరా ఫుటేజ్‌ ఆధారంగా నిందితులను గుర్తించారు. వారికోసం గాలిస్తుండగా ఏటుకూరు సెంటరులో ఉన్నట్టు తెలుసుకుని ముగ్గురిని అరెస్టు చేశారు. మద్యం, చిల్లర అలవాట్లకు గురై డబ్బుల కోసం ఈ నేరానికి పాల్పడ్డార న్నారు. వీరు ముగ్గురు నగరంలో కారు డ్రైవర్లుగా పని చేస్తూ చెడు వ్యసనాలకు లోనయ్యారన్నారు. కేసు ఛేదించిన అధికారులు, సిబ్బందిని సీఐ అభినందించారు. 


Updated Date - 2022-08-19T05:54:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising