ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నకిలీ బంగారంతో మోసగించిన నిందితుల అరెస్టు

ABN, First Publish Date - 2022-07-06T05:56:05+05:30

తమిళనాడ్‌ మార్కంటేయ్‌ బ్యాంక్‌ చేబ్రోలు బ్రాంచిలో నకిలీ బంగారం కుదువ పెట్టి రుణం పొంది మోసగించిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్సీ శ్రవంతిరాయ్‌ వెల్లడించారు.

నిందితులను అరెస్టు చూపిస్తున్న డీఎస్పీ శ్రవంతిరాయ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చేబ్రోలు, జూలై 5: తమిళనాడ్‌ మార్కంటేయ్‌ బ్యాంక్‌ చేబ్రోలు బ్రాంచిలో నకిలీ బంగారం కుదువ పెట్టి రుణం పొంది మోసగించిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్సీ శ్రవంతిరాయ్‌ వెల్లడించారు. మంగళవారం చేబ్రోలు పోలీస్‌స్టేషన్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ ప్రధాన నిందుతుడు సామోజు జయకృష్ణ బ్యాంక్‌లో ఏడేళ్లనుంచి గోల్డ్‌ అప్రయిజర్‌గా పనిచేస్తున్నట్లు చెప్పారు. అడ్డదారులలో డబ్బు సంపాదించాలనే దురుద్ధేశంతో గుంటూరులోని ఫ్యాన్సీ షాపుల్లో రోల్‌ ్డ గోరోల్డ్‌ కొనుగోలు కొని వాటికి గోల్డ్‌ కలర్‌ కోటింగ్‌ వేసి పలు దఫాలుగా తన కుమారుడు బాబూరావు,  జేజి సూర్య దుర్గాప్రసాద్‌ సహకారంతో వారి స్నేహితులు గోపిసాయి, లీలా అభిషేక్‌ ఖాతాల్లో 23 దఫాలుగా రూ.34.07 లక్షలను రుణాలను పొందారు. అలాగే కొండేపు సాయిలీల అనే మహిళ తన బంగారంతో రూ.2.30 లక్షల రుణం తీసుకుంటే నిందితులు ఆ బంగారాన్ని మార్చి నకిలీ బంగారాన్ని పెట్టి మోసం చేసినట్లు తేలిందన్నారు. నకిలీ బంగారంతో పాటు మణప్పరంలో తాకట్టు పెట్టిన బంగారాన్ని, రూ.50 వేల నగదును సీజ్‌ చేసినట్లు చెప్పారు. కేసును త్వరతిగతిన దర్యాప్తు చేసిన సీఐ ఎంవి.సుబ్బారావు, ఎస్‌ఐలు సత్యనారాయణ, కోటేశ్వరరావు, సిబ్బంది కె.గణేష్‌, అప్పలనాయుడు, శివనాగరాజు, శివయ్య, స్వాతిలను డీఎస్పీ శ్రవంతిరాయ్‌ ప్రత్యేకంగా అభినందించారు.

  


Updated Date - 2022-07-06T05:56:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising