ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చోరీల కేసులో నిందితుడి అరెస్టు

ABN, First Publish Date - 2022-08-11T06:01:06+05:30

నగరంలో చైన్‌స్నాచింగ్స్‌, ద్విచక్ర వాహనాలు, సెల్‌ఫోన్ల చోరీ కేసుల్లో షేక్‌ బషీర్‌ అనే నిందితుడిని కొత్తపేట పోలీసులు అరెస్టు చేశారు.

వివరాలు వెల్లడిస్తున్న కొత్తపేట సీఐ శ్రీనివాసులరెడ్డి, వెనుక నిందితుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బంగారం, ద్విచక్ర వాహనం స్వాధీనం

గుంటూరు, ఆగస్టు 10: నగరంలో చైన్‌స్నాచింగ్స్‌, ద్విచక్ర వాహనాలు, సెల్‌ఫోన్ల చోరీ కేసుల్లో షేక్‌ బషీర్‌ అనే నిందితుడిని కొత్తపేట పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం కొత్తపేట పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సీఐ శ్రీనివాసులరెడ్డి నిందితుడిని మీడియా ఎదుట హాజరుపరచి వివరాలు వెల్లడించారు. సీఐ కథనం మేరకు.. ఈనెల 9న కొల్లూరుకు చెందిన జెన్ను రమేష్‌, నాగలక్ష్మి దంపతులు వారి కుమారుడు హరీష్‌తో కలిసి కొత్తపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వచ్చి అక్కడ నడుస్తూ వెళుతుండగా గుర్తు నాగలక్ష్మి మెడలోని బంగారపు గొలుసును నిందితుడు హరీష్‌  తెంచుకుని ద్విచక్ర వాహనంపై ఉడాయించాడు. కొత్తపేట పోలీసులు కేసు నమోదుచేశారు. అంతకుముందు రోజు ఆర్టీసీ బస్టాండ్‌ సమీపం లోని ఓ హోటల్‌ వద్ద హోండా యాక్టివా ద్విచక్ర వాహనాన్ని అపహ రించాడు. దీనిపై కూడా కొత్తపేట స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎస్పీ ఆదేశాల మేరకు కొత్తపేట సీఐ శ్రీనివాసులరెడ్డి, సిబ్బంది దర్యాప్తు ప్రారంభించారు. గౌరీశంకర్‌ థియేటర్‌వద్ద హరీష్‌  అనుమానా స్పదంగా తిరుగుతుండగా అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా చైన్‌స్నాచింగ్‌, ద్విచక్ర వాహనం చోరీ చేసినట్టు తెలిపాడు. అతని వద్ద స్వాధీనం చేసుకున్న ద్విచక్ర వాహనంలో తనిఖీ చేయగా 15 సెల్‌ఫోన్లు, డమ్మీ పిస్టల్‌ లభ్యమయ్యాయి. నిందితుడు ప్రస్తుతం దేవాపురం 5వ లైనులో ఉంటున్నాడని, గతంలో రామిరెడ్డితోటలో ఉండేవాడని పోలీసులు తెలిపారు. నిందితుడు బషీర్‌పై విజయవాడ, నున్న, గన్నవరం, పటమట, పాతగుంటూరు, లాలాపేట, కొత్తపేట తదితర పోలీస్‌స్టేషన్లలో గతంలో అనేక కేసులు నమోదైనట్టు సీఐ తెలిపారు. ఎవరైనా సెల్‌ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు ఉంటే పూర్తి ఆధారాలతో కొత్తపేట పోలీస్‌స్టేషన్‌ను సంప్రదించాలని సీఐ కోరారు. కేసు చేధించిన సీఐ, ఎస్‌ఐలు, సిబ్బందిని ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ అభినందించి రివార్డులు ప్రకటించారు. 


Updated Date - 2022-08-11T06:01:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising