ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అగ్నిపథ్‌ పథకాన్ని ఉప సంహరించుకోవాలి

ABN, First Publish Date - 2022-06-30T05:22:25+05:30

దేశవ్యాప్తంగా యువత వ్యతిరేకిస్తున్న అగ్నిపథ్‌ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఉప సంహరించుకోవాలని ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ మస్తాన్‌వలి డిమాండ్‌ చేశారు.

గాంధీ విగ్రహం ఎదుట బైఠాయించి నిరసన తెలియజేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మస్తాన్‌వలి

గుంటూరు, జూన్‌ 29: దేశవ్యాప్తంగా యువత వ్యతిరేకిస్తున్న అగ్నిపథ్‌ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఉప సంహరించుకోవాలని ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ మస్తాన్‌వలి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం ఎన్‌ఎస్‌యూఐ నగర అధ్యక్షుడు షేక్‌ కరీం ఆధ్వర్యంలో  కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం నుంచి హిమనీ సెంటర్‌లోని మహాత్మాగాంధీ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్తులు అమ్మినట్టు దేశ రక్షణ దళాన్ని ప్రైవేటు పరం చేయాలన్న దుష్ట ఆలోచన విరమించుకోవాలన్నారు. యువతకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌ నగేష్‌ కరియప్ప మాట్లాడుతూ దేశంలో నిరుద్యోగ యువతను ప్రధాని మోదీ మోసం చేశారని విమర్శించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు లింగంశెట్టి ఈశ్వరరావు, నగర అధ్యక్షుడు షేక్‌ ఉస్మాన్‌, అమృతతేజ్‌, వేముల శ్రీనివాస్‌, జక్కా శ్రీనివాస్‌, మోషే పలువురు నాయకులున్నారు. 


Updated Date - 2022-06-30T05:22:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising