ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫుడ్‌ సేఫ్టీపై శిక్షణా కార్యక్రమాలు

ABN, First Publish Date - 2022-01-20T05:43:13+05:30

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే ఫుడ్‌ సేఫ్టీపై నలంద ఎడ్యుకేషన్‌ సొసైటీ భాగస్వామ్యంతో జిల్లాలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఏపీ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌, నలంద ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ ఆరిమండ వరప్రసాద్‌రెడ్డి, ఏపీ రాష్ట్ర పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ ఆరిమండ విజయశారదారెడ్డి తెలిపారు.

సమావేశంలో మాట్లాడుతున్న వరప్రసాద్‌రెడ్డి, విజయశారదారెడ్డి, ఆంజనేయులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, జనవరి 19: కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే ఫుడ్‌ సేఫ్టీపై నలంద ఎడ్యుకేషన్‌ సొసైటీ భాగస్వామ్యంతో జిల్లాలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఏపీ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌, నలంద ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ ఆరిమండ వరప్రసాద్‌రెడ్డి, ఏపీ రాష్ట్ర పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ ఆరిమండ విజయశారదారెడ్డి తెలిపారు. గుంటూరు జిన్నాటవర్‌ సెంటర్‌లోని చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ నియమ, నిబంధనలకు అనుగుణంగా ఫుడ్‌ సేఫ్టీపై శిక్షణ ఇస్తామన్నారు. ఆహారం తయారీ, అమ్మకం,  ఫ్రాసెసింగ్‌, ప్యాకింగ్‌ వంటి రంగాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణతో పాటు సర్టిఫికెట్లను అందజేస్తామన్నారు. మొదట బ్యాచ్‌గా వీధి వ్యాపారులకు శిక్షణ నిచ్చి, సర్టిఫికెట్లు అందజేస్తామన్నారు. ఔత్సాహికులు శిక్షణ కోసం 7093914924 నెంబర్‌లో సంప్రదించాలన్నారు.   సమావేశంలో చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ జిల్లా అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు, కార్యదర్శి రంగా బాలకృష్ణ, కిరాణా మర్చంట్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి తల్లం చాముండేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2022-01-20T05:43:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising