ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలి : Ramakrishna

ABN, First Publish Date - 2022-07-21T22:29:10+05:30

పల్నాడు జిల్లా: ఏపీకి ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా గురించి ప్రధాని మోదీని అడిగే పరిస్థితుల్లో చంద్రబాబు లేడని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పల్నాడు జిల్లా: ఏపీకి ప్రత్యేక హోదా (Special Status) కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ (Ramakrishna) డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా గురించి ప్రధాని మోదీని అడిగే పరిస్థితుల్లో చంద్రబాబు లేడని పేర్కొన్నారు. సీఎం జగన్ అన్ని పార్టీలను కలుపుకుని కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ ఆస్థులను ప్రైవేకరించే దిశగా ముందుకు సాగుతోందన్నారు. 


13 జిల్లాలతో కూడిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ రాజ్యసభలో ప్రకటన చేశారు. కేంద్ర కేబినెట్ కూడా దానికి అంగీకారం తెలిపింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ ప్రత్యేక హోదాను అమలు పర్చ లేదు. అసోం, నాగాలాండ్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాలకు మాత్రమే ఈ ప్రత్యేక హోదా ఉండేది. తర్వాత వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన డిమాండ్లు , అక్కడి పరిస్థితుల కారణంగా మరో  8 రాష్ట్రాలు అరుణాచల్‌ప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్‌ కూడా హోదా కల్పించారు. దేశంలో ఇప్పటికి 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించారు. ప్రత్యేక హోదా ఇస్తే.. కేంద్ర ప్రభుత్వ పథకాల్లో 90 శాతం నిధులను గ్రాంట్లుగా, 10 శాతం నిధులను ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు రుణంగా ఇస్తారు. పన్నుల్లో మినహాయింపు కూడా ఉంటుంది.

Updated Date - 2022-07-21T22:29:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising