ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్న క్యాంటీన్లు పునః ప్రారంభించాలి: సీఎం జగన్‌కు Nara Lokesh లేఖ

ABN, First Publish Date - 2022-06-25T23:26:45+05:30

Amaravathi: అన్న క్యాంటీన్లు పునః ప్రారంభించాలని సీఎం జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. పేదలు, కార్మికుల ఆకలి తీర్చాలని విజ్ఞప్తి చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Amaravathi: అన్న క్యాంటీన్లు పునః ప్రారంభించాలని సీఎం జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. పేదలు, కార్మికుల ఆకలి తీర్చాలని విజ్ఞప్తి చేశారు. 

రాష్ట్రంలో 4.31 కోట్ల మంది పేదల ఆకలి తీర్చాయి

‘‘మీరు అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే పేద‌ల‌పై కోప‌మో..అన్న‌గారి పేరుమీద ద్వేష‌మో..ఆక‌లి జీవులంటే అస‌హ్య‌మో తెలియ‌దు కానీ అన్న క్యాంటీన్లను మూసేశారు. రాష్ట్రంలో4.31 కోట్ల మంది పేదల ఆకలి తీర్చిన అన్న క్యాంటీన్లకి రంగులు మార్చి తాళాలు వేయ‌డంతో పేద‌లు, కూలీలు, అభాగ్యులు ఆక‌లితో అలమటిస్తున్నారు. పట్టణాలకు  ప‌నుల మీద వ‌చ్చేవారంద‌రికీ రూ.5కే చక్కని భోజనం, అల్పాహారం అందించాలని .. అప్పటి ముఖ్యమంత్రి  చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా 201 అన్న క్యాంటీన్లు ప్రారంభించారు. రుచిగా..శుచిగా ఆహారం అందించే బాధ్య‌త‌ను హరేకృష్ణా అనే సేవా సంస్థకు అప్ప‌గించిన విష‌యం మీకు తెలిసిందే. అన్న క్యాంటీన్ల నిర్వహణ కోసం బడ్జెట్‌లో రూ.200 కోట్లు కేటాయించాం. మీరు అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్ల బిల్లులు ఆపేశారు. అన్న క్యాంటీన్ల‌ను మూసేసే కుట్ర జ‌రుగుతోంద‌ని మేము అడిగితే, లేద‌ని స‌మాధానం ఇచ్చిన మీ ప్ర‌భుత్వం.. ఆ త‌రువాతి రోజే వాటిని మూసేసింది. దీంతో నిరుప‌యోగంగా ఉన్న అన్న క్యాంటీన్లు అసాంఘిక కార్య‌కలాపాల‌కు అడ్డాగా మారాయి. మ‌రికొన్నింటిని వార్డు స‌చివాల‌యాలుగా వాడుతున్నారు. కొన్నింటిని జేసీబీల‌తో కూల‌గొట్టారు. మీ రివర్స్ పరిపాలన కారణంగా గతంలో ఉన్న అన్న క్యాంటీన్ల సంఖ్య రెండింతలు పెంచాల్సిన అవసరం ఇప్పుడు ఏర్పడింది.’’ అని నారా లోకేశ్ విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2022-06-25T23:26:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising