ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒక్క చాన్స్ అని చెప్పిన పాపానికి ఇంతమంది ఆడబిడ్డలు చనిపోతున్నారు: అనిత

ABN, First Publish Date - 2022-04-28T17:45:31+05:30

గుంటూరు జిల్లా, దుగ్గిరాల మండలం, తుమ్మపూడిలో ఓ మహిళాపై అత్యాచారం, హత్య జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: విజయవాడ ఘటన మరిచిపోకముందే గుంటూరు జిల్లా, దుగ్గిరాల మండలం, తుమ్మపూడిలో ఓ మహిళాపై అత్యాచారం, హత్య జరిగింది. ఈ ఘటనకు వైసీపీకి చెందినవారే పాల్పడ్డారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై స్పందించిన తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ రాష్ట్రంలో రోజుకొక ఘటన జరుగుతోందన్నారు. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం లేదని, దీంతో జనాలకు భయం లేకుండాపోతోందన్నారు. అత్యాచారం, హత్య ఘటనలో దేశంలో ఏపీ మూడోస్థానంలో ఉండగా, లైంగిక వేధింపుల్లో రెండో స్థానంలో ఉందని ఆమె అన్నారు. ఒక్క చాన్స్ అని చెప్పిన పాపానికి ఇంతమంది ఆడబిడ్డలు చనిపోతున్నారని, ఇళ్లల్లో ఉన్న మహిళలకు రక్షణ లేకపోతే.. బయటకు వెళ్లే వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. చిన్నా, పెద్ద అందరిదీ ఇదే పరిస్థితని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పార్టీ.. ఈ పార్టీవారని కాకుండా ఇలాంటి పనులు చేసినవారికి వెంటనే శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఎఫ్ఐఆర్ ఎలా రాయాలో కూడా పోలీసులకు తెలియదా? అని అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-04-28T17:45:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising