ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజధాని లేని రాష్ట్రం ఎన్నాళ్లు?

ABN, First Publish Date - 2022-05-16T05:35:56+05:30

ఆంధ్రప్రదేశ్‌ను రాజధాని లేని రాష్ట్రంగా ఎన్నాళ్లు ఉంచుతారని రైతులు ప్రశ్నించారు. న్యాయం స్థానం ఇచ్చిన తీర్పును గౌరవించి అమరావతిని అభివృద్ధి చేయాలని కోరారు.

ఉద్దండ్రాయుని శిబిరంలో బిల్డ్‌ అమరావతి అంటూ నినాదాలు చేస్తున్న రైతులు, మహిళలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యాయస్థానం తీర్పును గౌరవించండి

880వ రోజుకు చేరుకున్న రైతుల ఆందోళనలు

తుళ్లూరు, మే 15: ఆంధ్రప్రదేశ్‌ను రాజధాని లేని రాష్ట్రంగా ఎన్నాళ్లు ఉంచుతారని  రైతులు ప్రశ్నించారు. న్యాయం స్థానం ఇచ్చిన తీర్పును గౌరవించి అమరావతిని అభివృద్ధి చేయాలని కోరారు. బిల్డ్‌ అమరావతి, సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అంటూ రైతులు, రైతు కూలీలు, మహిళలు చేస్తున్న ఆందోళనలు ఆదివారం 880వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు రైతు  ధర్నా శిబిరాల నుంచి మాట్లాడుతూ రాజధాని మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం అభివృద్ధి చెందుతుంటే ఆంధ్రులకు ఎంతో ఖ్యాతి వచ్చేదన్నారు. పాలకుల అనాలోచిత నిర్ణయాలతో బంగారు భవిష్యత్‌ నాశనం అవుతుందన్నారు. పాలకులు మారినంత మాత్రాన రాజధాని మారదన్నారు. ఎప్పటికైనా అమరావతి రాష్ట్ర ఏకైక రాజధానిగా ఉంటుందని స్పష్టమైనప్పుడు అభివృద్ధి చేయటానికి సంకోచం ఎందుకని ప్రశ్నించారు.  రాజధాని 29 గ్రామాలలో ఆందోళనలు కొనసాగాయి.  


Updated Date - 2022-05-16T05:35:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising