ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆంధ్రుల ఆత్మగౌరవం అమరావతి

ABN, First Publish Date - 2022-08-20T05:28:53+05:30

అమరావతిని కాపాడి ఆంధ్రులను ఉన్నత స్థితికి చేర్చాలని రాజధానికి 33 వేల ఎకరాలు త్యాగం చేసిన రైతులు కోరారు.

బిల్డ్‌ అమరావతి అంటూ తుళ్ళూరు రైతు శిబిరంలో నినాదాలు చేస్తున్న మహిళలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

976వ రోజుకు చేరిన రైతుల ఆందోళలు 

తుళ్ళూరు, ఆగస్టు 19: అమరావతిని కాపాడి ఆంధ్రులను ఉన్నత స్థితికి చేర్చాలని రాజధానికి 33 వేల ఎకరాలు త్యాగం చేసిన రైతులు కోరారు.బిల్డ్‌ అమరావతి, సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌, ఉన్నత న్యాయస్థానం తీర్పును అమలు చేయాలని రైతులు చేస్తున్న ఉద్యమం శుక్రవారం 976వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రైతు ధర్నా శిబిరాల నుంచి వారు మాట్లాడుతూ ఆంధ్రుల ఆత్మగౌరవం అమరావతి అని పేర్కొన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో రూ.పదివేల కోట్లతో అమరావతి అభివృద్ధి పనులు జరిగితే, వైసీపీ ప్రభుత్వం వచ్చిన మూడేళ్లలో పదిపైసల పని కూడా జరగలేదన్నారు. అధికారం ఇచ్చింది అభివృద్ధి చేయడానికి కానీ, విధ్వంసం చేయమని కాదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో విధ్వంసకర పాలన జరుగుతోందన్నారు. అమరావతిని కాదని మూడుముక్కల ఆటతో రాష్ర్టాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ఉన్నత న్యాయస్థానం తీర్పును అమలు చేయాలన్నారు. బిల్డ్‌ అమరావతి అంటూ దీపాలు వెలిగించి అమరావతి వెలుగు కార్యక్రమం నిర్వహించారు. రాజధాని 29 గ్రామాల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.  


Updated Date - 2022-08-20T05:28:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising