ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రశ్నిస్తే అక్రమ కేసులా?

ABN, First Publish Date - 2022-05-20T05:01:16+05:30

ప్రభుత్వ విధానాలపై ప్రశ్నించే వారందరిపై అక్కమంగా కేసులు బనాయిండం రాష్ట్ర పాలకులకు పరిపాటిగా మారిం దని రాజధాని అమరావతికి భూములు త్యాగం చేసిన రైతులు అన్నారు

మందడం శిబిరంలో నినాదాలు చేస్తున్న మహిళలు, రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రైతులంటే పాలకులకు అంత చులకనా ?

884వ రోజు ధర్నా శిబిరంలో రైతులు, మహిళలు

తుళ్లూరు, మే 19: ప్రభుత్వ విధానాలపై ప్రశ్నించే వారందరిపై అక్కమంగా కేసులు బనాయిండం రాష్ట్ర పాలకులకు పరిపాటిగా మారిం దని రాజధాని అమరావతికి భూములు త్యాగం చేసిన రైతులు అన్నారు. బిల్డ్‌ అమరావతి, సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అంటూ రైతులు చేస్తున్న ఆందోళనలు గురువారం నాటికి 884వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రైతు ధర్నా శిబిరాల నుండి వారు మాట్లాడుతూ న్యాయం కోసం  ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిని నిర్వీర్యం చేస్తే పాలకులకు వచ్చేది ఏమిటని ప్రశ్నించారు. రైతులంటే పాలకులకు చులకన భావన ఉందనేది రాజధాని అమరావతి నిర్వీర్యంతో రాష్ట్ర ప్రజలందరికి అర్ధమౌవుతుందని అన్నారు. మూడు రాజధానులంటూ మూడేళ్ళ నుండి అమరావతిలో అభివృద్ది జాడ లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేమంటే మూడు ప్రాంతాల అభివృద్ది అని సాకు చెప్పారన్నారు. అభివృద్ది కోసం కాదని మూడు ప్రాంతాల మఽధ్య విధ్వేషాల కోసం పెట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కుయుక్తులన్నీ ఆపాలన్నారు. ప్రత్యేక హోదాతో అభివృద్ది జరుగుతుందన్నారు. ఆ అంశాన్ని లేవనెత్తి అమరావతి అభివృద్ధిని సీఎం జగన్‌రెడ్డి తుంగలో తొక్కారన్నారు. ఇప్పటికైనా హైకోర్టు తీర్పును అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. లేదంటే పదవల నుండి స్వచ్చందంగా తప్పుకోవటం మంచిదన్నారు. అభివృద్ధి పథంలో ముందుండాల్సిన  రాష్ట్రాన్ని అమరావతి నిర్వీర్యం చేయటంతో అధోగతి పాలైందని అన్నారు. బిల్డ్‌ అమరావతి సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అంటూ దీపాలు వెలిగించి అమరావతి వెలుగు కార్యక్రమం నిర్వహించారు. రాజధాని 29 గ్రామాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి.


Updated Date - 2022-05-20T05:01:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising