ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజధాని అమరావతిలో రైతుల ప్లాట్ల అభివృద్ధి కి శ్రీకారం

ABN, First Publish Date - 2022-07-05T06:12:25+05:30

రాజధాని అమరావతిలో రాజధాని రైతుల ప్లాట్ల అభివృద్దికి సీఆర్డీఏ సోమవారం శ్రీకారం చుట్టింది.

కొబ్బరికాయ కొట్టి రాజధానిలో పనులు ప్రారంభిస్తున్న కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

19.52 కోట్ల జోన్‌-4 మౌలిక వసతులు

దశల వారీగా జోన్ల అభివృద్ధి

తుళ్లూరు, జూలై 4: రాజధాని అమరావతిలో రాజధాని రైతుల ప్లాట్ల అభివృద్దికి సీఆర్డీఏ సోమవారం శ్రీకారం చుట్టింది. దొండపాడు పరిధిలోని పిచుకల పాలెం రెవెన్యూ పరిధిలోని జోన్‌ 4 లో సీఆర్డీఏ కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌ కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కమీషనర్‌ మాట్లాడుతూ, జోన్‌ అభివృద్ది పనులకు  199.52 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. సీఆర్డీఏ రైతులకు కేటాయించిన ప్లాట్లలో ప్రధాన సదుపాయాలైన రహదారులు, వంతెనలు,తాగునీరు సరఫరా, వరద నీటి కాలువలు, మురుగు నీరు కాల్వలల వ్యవస్థ, మురుగు నీటి శుద్ది కర్మాగారాలు, ,పచ్చదనం అభివృద్ది లాంటి ముఖ్యమైన మౌలిక సదుపాయాలు, ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ మొత్తం నిర్మాణ పనులు అభివృద్ది ఒప్పందాన్ని బీఎస్‌ఆర్‌ ఇన్‌ఫ్రాటెక్‌, ఇండియా లిమిటెడ్‌ బెంగళూరు వారు చేపడుతున్నారని పేర్కొన్నారు. రాజధాని  బృహత్తర ప్రణాళికలో భాగంగా జోన్‌-4 నిర్మాణపు  పనుల వలన 1358.42ఎకరాలలో మొత్తం 4,551 ప్లాట్లలో మౌలిక సదుపాయాల అభివృద్ది జరుగుతుందని , 63 కిలోమటర్ల రహదారి వ్యవస్థ ఏర్పాటు అవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఆర్డీఏ ఇంజనీరింగ్‌, అడ్మిన్‌ స్ర్టేషన్‌ అధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-05T06:12:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising