ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతితోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి

ABN, First Publish Date - 2022-09-08T05:40:19+05:30

రాష్ట్ర సమగ్రాభివృద్ధి అమరావతితోనే ముడిపడి ఉందన్న విషయం పాలకులు ఇకనైనా గుర్తించాలని మేధావులు తెలిపారు.

పాదయాత్ర మద్దతు దీక్షలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ లక్ష్మణరావు, పాల్గొన్న చలసాని శ్రీనివాసరావు తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజధాని వివాదానికి స్వప్తి చెప్పాలి

తెలుగు ప్రజలను మోసం చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలుు

రైతుల పాదయాత్రకు మద్దతుగా సీపీఎం ఆధ్వర్యంలో దీక్ష

గుంటూరు(తూర్పు), సెప్టెంబరు 7: రాష్ట్ర సమగ్రాభివృద్ధి అమరావతితోనే ముడిపడి ఉందన్న విషయం పాలకులు ఇకనైనా గుర్తించాలని మేధావులు తెలిపారు. ఈ నెల 12 నుంచి మొదలు కానున్న రైతుల పాదయాత్రకు మద్దతుగా బుధవారం బ్రాడీపేటలోని సీపీఎం కార్యాలయం ఆవరణలో ఒకరోజు దీక్ష చేపట్టారు. దీక్షలో ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు, ప్రత్యేకహోదా సాధనసమితి రాష్ట్ర కన్వీనర్‌ చలసాని శ్రీనివాసరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి పాశం రామారావు, అమరావతి జేఏసీ నాయకులు భాష్యం నరసయ్య ఇతర ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ రాజధానిగా అమరావతినే ఉంచాలంటూ ఐదుగురు పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు ఇప్పటికే స్పష్టంగా ప్రకటించినట్లు తెలిపారు. మూడు రాజధానుల బిల్లు మండలిలో ప్రవేశపెడితే వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. కేంద్రం రాజధాని నిర్మాణానికి రూ.47 వేలు కోట్లు ఇవ్వాల్పి ఉండగా, ఇప్పటి వరకు కేవలం రూవెయ్యి కోట్లు మాత్రమే ఇచ్చిందని గుర్తుచేశారు. రాజధాని రైతుల పాదయాత్రకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. చలసాని శ్రీనివాస్‌ మాట్లాడుతూ అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని అదే సమయంలో రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలని స్పష్టం చేశారు. కేంద్రం నిధులు ఇవ్వకుండా, రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానులు పేరిట నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. సీపీఎం నాయకులు వీ శ్రీనివాసరావు,  పాశం రామారావు మాట్లాడుతూ కోర్టులు జోక్యం చేసుకున్న తరువాత కూడా మూడు రాజధానుల బిల్లు పెడతామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం హేయమైన చర్య అని మండిపడ్డారు. కేంద్రం కూడా విభజన హామీలు అమలు చేయకుండా రాజధానికి నిధులు ఇవ్వకుండా మోసం చేస్తుందని విమర్శించారు. దీక్షలో టీ నరసింహారావు, హరి, రెహమన్‌, రవి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-09-08T05:40:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising