ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూరియా ఎక్కువరేటుకు అమ్మితే చర్యలు

ABN, First Publish Date - 2022-01-19T06:02:26+05:30

యూరియా ఎక్కువ ధరకు అమ్మితే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకొంటామని వ్యవసాయశాఖ జేడీ విజయభారతి హెచ్చరించారు.

ఎరువులకంపెనీ ప్రతినిధులతో సమీక్షిస్తున్న జేడీ విజయభారతి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డీలర్ల సమావేశంలో జేడీ విజయభారతి హెచ్చరిక

గుంటూరు, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): యూరియా ఎక్కువ ధరకు అమ్మితే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకొంటామని వ్యవసాయశాఖ జేడీ విజయభారతి హెచ్చరించారు. ఆంధ్రజ్యోతి జిల్లా సంచికలో మంగళవారం ‘యూరియా వారి దయ’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనంపై స్పందించిన జేడీ ఎరువుల కంపెనీ ప్రతినిధులతో జిల్లా కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో 40 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా ఉందని, నెలాఖరకు 22 వేల మెట్రిక్‌ టన్నులు వస్తుందన్నారు. మార్క్‌ఫెడ్‌ వద్ద 7,500 మెట్రిక్‌ టన్నులు ఉందని, ఆర్‌ఎఫ్‌సీఎల్‌ కంపెనీ బుధవారం 2,600 మెట్రిక్‌ టన్నులు విడుదల చేస్తుందన్నారు. ఆర్‌బీకేలలో నిల్వలు పెంచుతామన్నారు. రైతులకు యూరియా సకాలంలో ప్రభుత్వ ధరలకు అమ్మే ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. సమావేశంలో డీడీలు రామాంజనేయులు, మురళి, ఏడీలు హేమలత, రవికుమార్‌, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-19T06:02:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising