ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయాలి

ABN, First Publish Date - 2022-08-07T05:18:00+05:30

అధికారం చేపట్టిన వారం రోజుల్లో పూర్తి న్యాయం చేస్తామని చెప్పి 38 నెలలు గడుస్తున్నా ఇంతవరకు తమ గురించి పట్టించుకోలేదని అగ్రిగోల్డ్‌ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అగ్రిగోల్డ్‌ బాధితులతో కలెక్టరేట్‌ ఎదుట నిరసనకు దిగిన ముప్పాళ్ల . జంగాల తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సెప్టెంబరు 6ప విజయవాడలో భారీ ర్యాలీ 

గుంటూరు(తూర్పు), ఆగస్టు 6: అధికారం చేపట్టిన వారం రోజుల్లో పూర్తి న్యాయం చేస్తామని చెప్పి 38 నెలలు గడుస్తున్నా ఇంతవరకు తమ గురించి పట్టించుకోలేదని అగ్రిగోల్డ్‌ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్వరమే సొమ్ము చెల్లించి న్యాయం చేయాలంటూ శనివారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట వారు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌ అండ్‌ ఏజెంట్స్‌ వెల్పేర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరరావు మాట్లాడుతూ మరణించి అగ్రిగోల్డ్‌ బాధిత కుటుంబాలకు రూ.10లక్షలు ఇస్తామన్న ముఖ్యమంత్రి హామీ ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రంలో సంక్షేమ పధకాలకు రూ.167 కోట్లు అప్పులు చేసిన ప్రభుత్వం, అగ్రిబాధితులకు రూ.4 వేల కోట్లు చెల్లించలేకపోతుందా అని ప్రశ్నించారు. ఆస్తులను ఎటాచ్‌ చేసుకుని బాధితులకు న్యాయం చేయకపోవడం దుర్మార్గమన్నారు. మరో నెలరోజులు వేచి చూస్తామని అప్పటికీ న్యాయం జరగకపోతే సెప్టెంబరు 6న బాధితులతో విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు.  అనంతరం డీఆర్వో చంద్రశేఖరరావుకు వినతిపత్రం అందజేశారు. నిరసనల్లో అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు మంత్రూనాయక్‌, జంగాల అజయ్‌కుమార్‌, కోటామాల్యాద్రి, చంద్రశేకరరావు, నాగరాజు, అంజనీదేవి, పెదరామయ్య తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-07T05:18:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising