ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏసీబీ వలలో వరగాని వీఆర్వో

ABN, First Publish Date - 2022-09-29T06:12:56+05:30

లంచం తీసుకుంటూ మేడికొండూరు మండలంలోని వరగాని వీఆర్వో షేక్‌ మౌలాలి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.

ఏసీబీ అధికారులకు పట్టుబడిన వీఆర్వో మౌలాలి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మేడికొండూరు, సెప్టెంబర్‌ 28: లంచం తీసుకుంటూ మేడికొండూరు మండలంలోని వరగాని వీఆర్వో షేక్‌ మౌలాలి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ అడిషనల్‌ ఎస్పీ వెంకట్రావు తెలిపిన వివరాల ప్రకారం.. వరగాని గ్రామానికి చెందిన ఈవూరి నాగిరెడ్డి అనే రైతు తనకున్న ఎకరం 28సెంట్ల భూమికి సంబంధించి పట్టాదారు పాసుపుస్తకం కోసం స్థానిక సచివాలయంలో ధరఖాస్తు చేసుకున్నారు. అవిషయమై వీఆర్వోను కలవగా రూ.8వేలు లంచం ఇస్తేనే పాసు పుస్తకాలు ఇస్తామని డిమాండ్‌ చేశాడు.  దీంతో నాగిరెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు వీఆర్వో నగదు తీసుకుంటుండగా దాడి చేసి పట్టుకున్నారు. దాడులలో డీఎస్పీ ప్రతాప్‌కుమార్‌, సీఐ శ్రీధర్‌, రవి, నాగరాజు, అంజిబాబు, సురేష్‌, మన్మధరావు, ఎస్‌ఐ శ్రీనివాసమూర్తి తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-09-29T06:12:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising