ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అసలు ఫీజు రూ.125 అదనంగా రూ.1000 వసూలు!

ABN, First Publish Date - 2022-01-29T05:40:50+05:30

ఇప్పటికే రెండుదశల్లో వచ్చిన కరోనాతో ఉక్కిరిబిక్కిరైన విద్యార్థులకు పది పరీక్షల ఫీజు మరో శరాఘతంగా మారుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పది విద్యార్థుల నుంచి పరీక్ష ఫీజు పేరుతో బాదుడు

జిల్లాలోని కొన్ని ప్రైవేటు విద్యా సంస్థల నిర్వాకం

నిఘా పెట్టి చర్యలు తీసుకోవాలంటున్న తల్లిదండ్రులు 

గుంటూరు(విద్య), జనవరి 28: ఇప్పటికే రెండుదశల్లో వచ్చిన కరోనాతో ఉక్కిరిబిక్కిరైన విద్యార్థులకు పది పరీక్షల ఫీజు మరో శరాఘతంగా మారుతోంది. కొన్ని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల్లో నిర్ధేశించిన ఫీజు కాకుండా భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోణలు వస్తున్నాయి. జిల్లాలో ప్రభుత్వం, జడ్పీ, ఎయిడెడ్‌, ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలలు దాదాపు 545పైగా ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో 57వేల మంది ఈ ఏడాది పది పరీక్షలకు హాజరవుతారని అంచనా. వాస్తవంగా పాఠశాల విద్యాశాఖ జారీచేసిన జీవోలో రెగ్యులర్‌ విద్యార్థులు రూ.125, మూడు సబ్జెక్టులపైన విద్యార్థులు రూ.125, మూడు సబ్జెక్టులలోపు రూ.110 పరీక్ష ఫీజు నిర్ణయించారు. వృత్తివిద్యా కోర్సుల విద్యార్థులు మాత్రం మరో రూ.60 అదనంగా చెల్లించాలి. అయితే ఇందుకు విరుద్ధంగా అనేక ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు రూ.1,000 నుంచి రూ.1,500 వరకు పరీక్ష ఫీజులు రూపంలో వసూలు చేస్తున్నాయి. అదేమంటే బస్సులు ఏర్పాటు చేస్తామని,  విద్యాశాఖలో ఇన్విజిలేటర్స్‌గా నియమించే వారికి ఇవ్వాలనే సాకుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి పీజులు వసూలు చేస్తున్నారు. ఇప్పటికే అనేక ప్రైవేటు విద్యాసంస్థలపె విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదులు చేస్తున్నారు. అయినా ఇవేమీ పట్టించుకోకుండా ఫీజుల్ని వసూలు చేయడమే లక్ష్యంగా యాజమాన్యాలు వ్యహరిస్తున్నాయి. మరో వైపు అదనపు ఫీజుల విషయం విద్యాశాఖకు ఫిర్యాదు చేస్తే భవిష్యత్తులో తమ పిల్లల్ని ఇబ్బందులు పెడతారేమోనని అనేకమంది తల్లిదండ్రులు మౌనంగా ఉంటూ ఫీజులు చెల్లిస్తున్నారు. గుంటూరు నగరంలోపాలు జిల్లావ్యాప్తంగా ఇదే తరహాలో ప్రైవేటు స్కూల్స్‌ యాజమాన్యాలు విద్యార్థుల్ని పీడించి ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి అదనపు ఫీజుల విషయంలో నిఘా పెంచాలని  తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.  


Updated Date - 2022-01-29T05:40:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising