ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రపతి టూర్‌లో గన్‌ మిస్‌ ఫైర్‌

ABN, First Publish Date - 2022-12-30T03:02:47+05:30

శ్రీశైలంలో జరిగిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనలో గన్‌ మిస్‌ఫైర్‌ అయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం బ్రాహ్మణకొట్కూరు పోలీసు స్టేషన్‌ ఎస్‌ఐ ఓబులేసు ఈ నెల 26న రాష్ట్రపతి బందోబస్తుకు వెళ్లారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీశైలం వన్‌టౌన్‌ ఆయుధాగారంలో అపశ్రుతి

బందోబస్తు ఎస్సై చేతుల్లోనే పేలిన తుపాకీ

విషయం దాచేసిన నంద్యాల పోలీసులు..ఆలస్యంగా వెలుగులోకి

నంద్యాల (ఆంధ్రజ్యోతి), డిసెంబరు 29: శ్రీశైలంలో జరిగిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనలో గన్‌ మిస్‌ఫైర్‌ అయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం బ్రాహ్మణకొట్కూరు పోలీసు స్టేషన్‌ ఎస్‌ఐ ఓబులేసు ఈ నెల 26న రాష్ట్రపతి బందోబస్తుకు వెళ్లారు. పోలీసు ఉన్నతాధికారులు ఆయనకు హెలిప్యాడ్‌ వద్ద విధులు కేటాయించారు. ఈ క్రమంలో పోలీ్‌సస్టేషన్‌లోని ఆయుధాల గది నుంచి గన్‌ తీసుకుంటుండగా, అది మిస్‌ఫైర్‌ అయి బుల్లెట్‌ స్టేషను భవనం రూఫ్‌కు తగిలింది. ఆ గదిలో గ్రెనేడ్‌లతోపాటు వివిధ రకాల తుపాకులు ఉన్నట్లు సమాచారం. మిస్‌ఫైర్‌ అయిన బుల్లెట్‌.. గ్రెనేట్లకు తగిలి ఉంటే స్టేషను మొత్తం పేలిపోయి ఉండేది. అదృష్టవశాత్తు అలాంటిది ఏమీ జరగకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటన గురించి తెలుసుకున్న స్థానిక డీఎస్పీ శ్రుతి స్టేషనుకు చేరుకొని... విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. చివరకు ఎస్పీకీ చెప్పలేదు. కానీ విషయం అనూహ్యంగా రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ డీజీకి తెలిసింది. ఆయన నంద్యాల ఎస్పీ రఘువీర్‌రెడ్డిని ఈ ఘటనపై ఆరా తీశారు. అయితే, ఆ విషయమే తెలియని ఎస్పీ... ఇంటెలిజెన్స్‌ డీజీకి ఏం చెప్పాలో తెలియక నీళ్లు నమిలినట్లు తెలుస్తోంది. అనంతరం డీఎస్పీ శ్రుతి సహా పలువురు పోలీసు అధికారులపై ఆయన విరుచుకుపడినట్లు సమాచారం. అడిషనల్‌ ఎస్పీ రమణతో ఆయన కమిటీ వేసి ఈ నెల 28న రహస్యంగా విచారణ జరిపించారు. ఎస్పీ రఘువీర్‌రెడ్డిని ’ఆంధ్రజ్యోతి’ సంప్రదించగా, గన్‌ మిస్‌ఫైర్‌ అయిన విషయం వాస్తవమేనని, విచారణలో నిజాలు బయటకు వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా.. విషయం కప్పిపుచ్చడంలో భాగంగా డీఎస్పీ ఓ బుల్లెట్‌ను తీసుకువచ్చి గన్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. ఈ బుల్లెట్‌ను ఎక్కడి నుంచి తీసుకువచ్చారో అర్థం కావడం లేదు.

8 శ్రీశైలం వన్‌టౌన్‌ ఆయుధాగారంలో అపశ్రుతి

8 బందోబస్తు ఎస్సై చేతుల్లోనే పేలిన తుపాకీ

8 విషయం దాచేసిన నంద్యాల పోలీసులు..ఆలస్యంగా వెలుగులోకి

Updated Date - 2022-12-30T03:02:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising