ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gudivada Casino: మళ్లీ తెరపైకి గుడివాడ కేసినో

ABN, First Publish Date - 2022-12-16T02:22:06+05:30

గుడివాడ కేసినో వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ ఏడాది సంక్రాంతి సమయంలో గుడివాడలో మూడు రోజులపాటు జరిగిన ఈ కేసినో రాజకీయంగా తీవ్ర స్థాయిలో దుమారం లేపిన విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సమాచారం ఇవ్వాలని వర్లను కోరిన ఐటీ అధికారులు

అమరావతి, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): గుడివాడ కేసినో వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ ఏడాది సంక్రాంతి సమయంలో గుడివాడలో మూడు రోజులపాటు జరిగిన ఈ కేసినో రాజకీయంగా తీవ్ర స్థాయిలో దుమారం లేపిన విషయం తెలిసిందే. అప్పట్లో మంత్రిగా ఉన్న కొడాలి నాని ప్రమేయం... మద్దతుతోనే కేసినోను నిర్వహించారని, వందల కోట్ల మొత్తం అక్కడ చేతులు మారిందని టీడీపీ నేతలు ఆరోపించారు. కేసినో నిర్వహణకు సంబంధించిన ఫొటోలతో సహా వారు కొంత సమాచారంతో దీనిపై వివిధ దర్యాప్తు సంస్థలకు అప్పట్లో ఫిర్యాదు చేశారు. ఈ కేసినోను నిర్వహించిన చీకోటి ప్రవీణ్‌ను ఇటీవల ఈడీ అధికారులు హైదరాబాద్‌లో విచారించారు. ఈ నేపథ్యంలో గుడివాడ కేసినో నిర్వహణపై తన వద్ద ఉన్న సమాచారాన్ని తమకు అందచేయాలని కోరుతూ టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్యకు ఐటీ అధికారులు వర్తమానం పంపారు. ఈ నెల 19న విజయవాడలో తమను కలవాలని ఆయనకు వారు సమాచారం పంపినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి.

Updated Date - 2022-12-16T02:22:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising